అమెరికాలో ఈరోజు : వంగూరి ఫౌండేషన్ వారి తెలుగు పుస్తక ప్రచురణ మహోత్సవం...

అమెరికాలో ఉన్న తెలుగు సంఘాలలో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికాకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.తెలుగు బాషాభివ్రుద్దికి, తెలుగు సంస్కృతీ, సాంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూ ఎన్నో ఏళ్ళుగా అమెరికాలో సేవలు అందిస్తున్న వంగూరి ఫౌండేషన్ ఎంతో మంది తెలుగు వారికి ఆదర్శంగా నిలిచింది.

1994 లో అమెరికాలో స్థాపించబడిన తెలుగు వారి సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది.1995 లో తెలుగు పుస్తక ప్రచురణ చేయడం మొదలు పెట్టింది.అప్పట్లో అమెరికా తెలుగు కధానిక పేరుతో మొదలు పెట్టిన మొదటి ప్రచురణ ఎంతో ప్రాచుర్యం పొందింది.

ఆ తరువాత వంగూరి ఫౌండేషన్ క్రమం తప్పకుండా పుస్తక ప్రచురణలు చేపడుతూనే ఉంది.ఈ క్రమంలోనే నేడు 100 వ పుస్తక ప్రచురణ మహోత్స వేడుకలను జరుపుకోనుంది.

Vanguri Foundation America 100th Telugu Book Publication , Vanguri Foundation,

ప్రస్తుతం 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు విశేష సంచిక విడుదల చేయడానికి అమెరికాలో అన్ని ఏర్పాట్లు చేస్తోంది.ఫౌండేషన్ స్థాపించి 27 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి భారత ఉపరాష్ట్రపతి విశిష్ట అతిధిగా పాల్గొని పుస్తక ఆవిష్కరణ చేపట్టనున్నారు.

గడిచిన 27ఏళ్ళుగా అమెరికాలో ఎన్నో తెలుగు సాహిత్య వేదికలను ఏర్పాటు చేసి తెలుగు వెలుగులు ప్రసరింపజేసిన వంగూరి ఫౌండేషన్ నేడు జరగబోయే 100వ తెలుగు పుస్తక ప్రచురణను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది.ఈ వేడుకను ఈ రోజు అనగా ఆదివారం నిర్వహించనున్నారు.

Advertisement

భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు ఆన్లైన్ లో లైవ్ లో ఈ వేడుకలను వీక్షించవచ్చునని నిర్వాహకులు తెలిపారు.ఫేస్ బుక్, యూట్యూబ్ ద్వారా లైవ్ లో వీక్షించే అవకాశం కల్పించారు.యూట్యూబ్ ద్వారా వీక్షించే వారు https://youtube.com/channel/UCX https://youtube.com/channel/UCT https://youtube.com/c/SriSamskruthikaKalasaradhi ఫేస్ బుక్ ద్వారా వీక్షించాలనుకునే వారు https://www.facebook.com/Telugumalli/ https://www.facebook.com/SriSamskrutikaKalasaradhi/.

పబ్లిసిటీ కంటే అదే ముఖ్యమని చెప్పిన యామీ గౌతమ్.. అలా మాత్రం చేయొద్దంటూ?
Advertisement

తాజా వార్తలు