నందమూరి బాలకృష్ణ నుండి ఎవరు ఊహించని విధంగా టాక్ షో వస్తోంది.ఆహా లో రాబోతున్న అన్ స్టాపబుల్ టాక్ షో లో వచ్చే గెస్ట్ లు.
వారితో బాలయ్య అడిగే ప్రశ్నలు రాబట్టే సమాధానాల గురించి అందరి దృష్టి ఉంది.ఇదే సమయంలో బాలయ్య షో లో ఎవరు వస్తారు అనే విషయమై చర్చ జరుగుతున్న సమయంలో ప్రేక్షకులు మరియు అభిమానులు ముఖ్యంగా ఇద్దరు కావాలని ఎక్కువగా కోరుకుంటున్నారు.
వారే మెగాస్టార్ చిరంజీవి మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్. వీరిద్దరితో బాలయ్య అన్ స్టాపబుల్ టాక్ షో చేస్తే చూడాలని ఆశ పడుతున్నామని చాలా మంది అభిమానులు కోరుకుంటున్నారు.
కాని ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందా అంటే డౌటే అంటున్నారు.పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ టాక్ షో లో పాల్గొంటున్న వారి జాబిత ఇప్పటిక సిద్దం అయ్యింది.
ఒక వేళ వారిద్దరు ఇందులో ఉంటే ఖచ్చితంగా ఇప్పటికే ఆ పేర్లు వచ్చేవి.కాని వారు లేకపోవడం వల్లే టాక్ రాలేదు.
బాలకృష్ణ నుండి టాక్ షో రావడమే గొప్ప విషయం గా ప్రేక్షకులు మరియు అభిమానులు భావిస్తున్నారు.కనుక బాలయ్య నుండి వస్తున్న ఆ టాక్ షో లో వీరిద్దరిని గెస్ట్ లుగా ఆశించడం మరీ అతి అవుతుందని అంటున్నారు.
ఎన్టీఆర్ తో విభేదాలు ఉంటాయని అందరికి తెలిసిన విషయం.ఇక బాలయ్య మరియు చిరంజీవిల మద్య ఉన్న విషయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఇద్దరు కూడా బిగ్గెస్ట్ స్టార్స్ అవ్వడం వల్ల మొదటి నుండి పోటీ ఉంటుంది.ఇద్దరు కూడా పైకి మంచి స్నేహితులుగా కనిపిస్తారు కాని పోటీ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది.ఒక వేళ బాలయ్య నుండి ఆహ్వానం అందితే ఖచ్చితంగా చిరు వెళ్తాడు.కాని బాలయ్య అందుకు ఆసక్తిగా ఉన్నాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.ఇక ఎన్టీఆర్ కు బాలయ్య ఆహ్వానం అందడం కష్టమే.ఎన్టీఆర్ ఒప్పుకోవడం కూడా కష్టమే అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇద్దరిలో ఒక్కరు అయినా షో కు వస్తే రికార్డు వ్యూస్ ఖాయం.షో రికార్డు సక్సెస్ ఖాయం.