'వకీల్‌ సాబ్‌' నుండి ఆ సాంగ్‌ రాబోతుందట.. రచ్చ రచ్చ ఖాయం

పవన్‌ కళ్యాణ్‌ వకీల్‌ సాబ్‌ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఎట్టకేలకు సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాలు జోరందుకున్నాయి.

ఏప్రిల్‌ 3వ తారీకున యూసుఫ్‌ గూడ పోలీస్‌ గ్రౌండ్స్‌ లో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ను నిర్వహించాలని భావించినా కూడా కరోనా కారణంగా తెలంగాణ పోలీసు శాఖ వారు ఆ కార్యక్రమానికి అనుమతులు ఇచ్చేందుకు నిరాకరించింది.భారీ అంచనాలున్న వకీల్‌ సాబ్‌ సినిమాలో ఎక్కువగా పాటలు లేవు.

దాంతో ఈ సినిమా ప్రమోషన్‌ కోసం ఒక ప్రమోషనల్‌ సాంగ్‌ ను చేయాలని థమన్‌ నిర్ణయించుకున్నాడు.అందుకోసం రెండు మూడు రోజుల పాటు కష్టపడి అభిమానుల జోష్‌కు తగ్గట్లుగా ఒక ట్యూన్‌ ను రెడీ చేసినట్లుగా సమాచారం అందుతోంది.

వకీల్‌ సాబ్‌ ప్రమోషనల్‌ సాంగ్‌ సినిమా విడుదలకు సరిగ్గా వారం రోజుల ముందు విడుదల చేసే అవకాశం ఉందంటున్నారు.అతి త్వరలోనే ఆ విషయమై క్లారిటీ వచ్చింది.

Advertisement

ఎప్పుడు అయినా విడుదల అయ్యేందుకు పాట పూర్తి చేసి దర్శకుడు థమన్‌ సిద్దంగా ఉంచాడు.ఇప్పటికే దిల్‌ రాజు ఆ పాట ఫైనల్‌ మార్పులు చేర్పులు చెప్పడంతో పాటు పవన్‌ కూడా విన్నట్లుగా తెలుస్తోంది.

ప్రమోషనల్‌ సాంగ్‌ ను ఎవరి మీద చిత్రీకరించారు అనేది ఆసక్తి గా ఉంది.తప్పకుండా సినిమా పై అంచనాలు పెంచే విధంగా ఈ ప్రమోషనల్‌ సాంగ్‌ ఉంటుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే సినిమాకు సెన్సార్‌ కార్యక్రమాలకు రంగం సిద్దం అయ్యింది.సినిమా అన్ని ఏరియాల్లో కూడా భారీ మొత్తానికి అమ్ముడు పోయిందని తెలుస్తోంది.

వకీల్‌ సాబ్‌ సినిమా లో శృతి హాసన్‌ గెస్ట్‌ హీరోయిన్‌ గా కనిపించబోతుంది.ఇక కీలక పాత్రల్లో అంజలి, నివేథా థామస్‌ మరియు అనన్యలు కనిపించబోతున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 25, ఆదివారం, 2021
Advertisement

తాజా వార్తలు