అమెరికా అధ్యక్ష ఎన్నికలు : కమలా హారిస్‌తో డిబేట్‌కు సిద్ధం.. స్వయంగా ప్రకటించిన ట్రంప్

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.

డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్ధిగా ఖరారైన భారత సంతతి నేత, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌‌తో ( Kamala Harris )ముఖాముఖి చర్చకు రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి, మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) అంగీకరించారు.

ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా తన ట్రూత్ సోషల్ మీడియాలో వెల్లడించారు.సెప్టెంబర్ 4న ఫాక్స్ న్యూస్ నిర్వహించే చర్చా కార్యక్రమంలో కమలా హారిస్‌ను ఎదుర్కొంటానని తెలిపారు.

నిజానికి అదే రోజున ఏబీసీ ఛానెల్‌లో జో బైడెన్‌తో ( Joe Biden in ABC channel )తాను డిబేట్‌లో పాల్గొనాల్సి ఉందని.అయితే అధ్యక్ష రేసు నుంచి ఆయన అనూహ్యంగా తప్పుకోవడంతో ఆ చర్చా కార్యక్రమం రద్దయ్యిందని ట్రంప్ పేర్కొన్నారు.

ఫాక్స్ న్యూస్ నిర్వహించే ప్రెసిడెన్షియల్ డిబేట్ పెన్సిల్వేనియాలో జరుగుతుందని, ఈసారి ప్రేక్షకులు కూడా హాజరవుతారని మాజీ అధ్యక్షుడు తెలిపారు.అయితే ఈ చర్చా కార్యక్రమానికి కమలా హారిస్ ఓకే చెప్పారా , లేదా అన్నది తెలియాల్సి ఉంది.

Advertisement
Us Presidential Election 2024 Trump Agrees To Debate Kamala Harris On September

కాకపోతే.ట్రంప్‌తో డిబేట్‌కు తాను సిద్ధమేనని కమల గతంలోనే ప్రకటించారు.

Us Presidential Election 2024 Trump Agrees To Debate Kamala Harris On September

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఒక ప్రెసిడెన్షియల్ డిబేట్ జరిగింది.జూన్‌లో జరిగిన ఈ చర్చా కార్యక్రమంలో ట్రంప్- బైడెన్‌లు తలపడ్డారు.ఇందులో ఇద్దరు నేతలు వాడి వేడి విమర్శలు చేసుకున్నారు.

అయితే ట్రంప్ దూకుడు ముందు బైడెన్ తేలిపోవడమే గాక.కొన్ని అంశాలపై బదులివ్వలేకపోయారు.అప్పటికే బైడెన్ వయసు, వృద్ధాప్య సమస్యలను ప్రస్తావిస్తూ అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలని సొంత పార్టీ నుంచే ఒత్తిళ్లు వస్తుండటంతో ఈ డిబేట్ ఆ డిమాండ్లకు మరింత బలాన్నిచ్చింది.

Us Presidential Election 2024 Trump Agrees To Debate Kamala Harris On September

అన్ని వైపుల నుంచి ఒత్తిడి ఎక్కువ కావడంతో తాను అధ్యక్ష ఎన్నికల బరిలో నుంచి తప్పుకుంటున్నట్లు జో బైడెన్ ప్రకటించారు.అయితే ఆయన వెళ్తూ వెళ్తూ కమలా హారిస్ పేరును ప్రతిపాదించడం.అందుకు పార్టీలోని మెజారిటీ నేతలు సైతం ఆమోదం తెలపడంతో కమల అభ్యర్ధిత్వం ఖరారైంది.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
ట్రంప్‌కు సిలికాన్ వ్యాలీ సపోర్ట్.. వాళ్లతో కలిసి పనిచేస్తా : భారత సంతతి క్యాపిటలిస్ట్

ఈ నెలాఖరులో చికాగోలో జరగనున్న డెమొక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్‌లో కమలా హారిస్‌ను పార్టీ అధ్యక్ష అభ్యర్ధిగా అధికారికంగా ప్రకటిస్తారని అమెరికన్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు