ఒమ్రికాన్ ఎంట్రీ.. జాగ్రత్తపడకుంటే కష్టమే, బూస్టర్ డోసుపై జో బైడెన్ ఫోకస్...!!!

కరోనా కొత్త వేరియంట్ ఒమ్రికాన్ .నెమ్మదిగా విస్తరిస్తోంది.

సరిహద్దులు మూసేసినా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇది అడుగుపెట్టేస్తోంది.అయితే ఇప్పుడు అందరిదీ ఒకటే టెన్షన్.

ఈ వేరియంట్‌ను ప్రస్తుతమున్న వ్యాక్సిన్లు అడ్డుకోగలవా.లేదా అని.అయితే కొందరు నిపుణులు మాత్రం బూస్టర్ డోస్ ఆవశ్యకతను తెలియజేస్తున్నారు.కొత్త వ్యాక్సిన్ కోసం ఎదురుచూడకుండా వీలైనంత త్వరగా బూస్టర్ డోసును తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు భవిష్యత్తులో వచ్చే ఇతర వేరియంట్లతోనూ పోరాడే సామర్ధ్యాన్ని పెంపొందిస్తాయని చెబుతున్నారు.ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైతం దేశ ప్రజలను బూస్టర్ డోస్ దిశగా సమాయత్తం చేస్తున్నారు.

Advertisement

శీతాకాల ప్రణాళికలో భాగంగా బూస్టర్‌ డోసులను ఇప్పించాలని బైడెన్‌ భావిస్తున్నారు.దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రచార కార్యక్రమాన్ని సైతం ప్రారంభించనున్నారు.ఇదే సమయంలో ఇంటి దగ్గర కరోనా టెస్టులు చేయించుకుంటే ఖర్చులు చెల్లించాలని ప్రయివేటు ఆరోగ్య భీమా సంస్థలను సర్కార్ ఆదేశించనుంది.

అమెరికాలో మొత్తం పది కోట్ల మంది బూస్టర్‌ డోసులకు అర్హత సాధించారు.ప్రభుత్వం, అధికారులు, స్వచ్చంధ సంస్థలు ఎంతగా ప్రయత్నించినా మరో 40.3 లక్షల మంది రకరకాల కారణాలతో అసలు టీకా జోలికే వెళ్లలేదు.వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని బూస్టర్‌ డోసులపై అవగాహన కల్పించనున్నారు.మరోవైపు అమెరికాలోనూ ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తోంది.

ఇప్పటి వరకు అక్కడ నాలుగు రాష్ట్రాల్లో ఈ వేరియంట్ కేసులు నమోదయ్యాయి.అమెరికాలో తొలికేసు నవంబర్‌ 25న కాలిఫోర్నియాలో నమోదవ్వగా.

ఇప్పుడు అది మిన్నెసొటా, న్యూయార్క్‌, కొలరాడోకు విస్తరించింది.అత్యధికంగా న్యూయార్క్‌లో 5 కేసులు వున్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి.

జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!
పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?

ఇందులో 67 ఏండ్ల మహిళ కూడా ఉన్నారని, స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది.ఆమె ఈమధ్యే దక్షిణాఫ్రికా వెళ్లి.

Advertisement

నవంబర్‌ 25న అమెరికాకు తిరిగి వచ్చారని, గత మంగళవారం ఆమెకు కరోనా పాజిటివ్‌‌గా తేలిందని అధికారులు వెల్లడించారు.ఈ నేపథ్యంలో న్యూయార్క్ గవర్నర్ క్యాథి హోచుల్ స్పందించారు.

‘వ్యాక్సిన్‌.బూస్టర్‌ తీసుకుని, మాస్క్‌ ధరించాలని ట్వీట్‌ చేశారు.

తాజా వార్తలు