'ఉప్పెన' కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్‌ న్యూస్‌

వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా కృతి శెట్టి హీరోయిన్‌ గా బుచ్చి బాబు సన దర్శకత్వంలో రూపొందిన ఉప్పెన సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

సుకుమార్‌ శిష్యుడు అయిన బుచ్చి బాబు ఈ సినిమా ను తెరకెక్కించిన తీరు విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.

మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మాణంలో రూపొందిన ఉప్పెన సినిమా వంద కోట్లకు పైగా వసూళ్లను దక్కించుకున్న విషయం తెల్సిందే.ఈ ఏడాదిలోనే కాకుండా గడచిన ఏడాది కాలంగా ఉప్పెన సినిమా ఇండియాలోనే అత్యధిక వసూళ్లు దక్కించుకున్న సినిమాగా నిలిచింది.

గత ఏడాది కరోనా కారణంగా సినిమాలు ఎక్కవ విడుదల అవ్వలేదు.విడుదల అయిన సినిమాలు పెద్దగా ఆడలేదు.

కనుక ఇండియాలోనే ఉప్పెన సినిమా టాప్‌ చిత్రంగా నిలిచింది అనడంలో సందేహం లేదు.ఉప్పెన కోసం భారీ గా ఖర్చు పెట్టిన నిర్మాతలకు అంతకు మించిన లాభం వచ్చింది అనడంలో సందేహం లేదు.

Advertisement

ఉప్పెన సినిమా ను ఓటీటీ లో వస్తే చూడాలని చాలా మంది ఆశ పడుతున్నారు.తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా ఇతర భాషల వారు కూడా ఈ సినిమా ను చూసేందుకు ఉవ్విల్లూరుతున్నారు.

పెద్ద ఎత్తున సినిమా ను విడుదల చేసినా కూడా జనాలు ఇంకా ఓటీటీ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు అనడంలో సందేహం లేదు.విడుదల అయిన రెండు నెలల తర్వాత ఉప్పెన సినిమా నెట్‌ ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్‌ కు సిద్దం అయ్యింది.

ఏప్రిల్‌ 14వ తారీకున ఈ సినిమా ను స్ట్రీమింగ్‌ చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.నెట్‌ ఫ్లిక్స్‌ వారు ఈ విషయాన్ని అధికారికంగా ఒకటి రెండు రోజుల్లోనే ప్రకటించే అవకాశం ఉందంటున్నారు.

థియేటర్లలో ఎలా అయితే సక్సెస్‌ ను దక్కించుకుందో అలాగే ఈ సినిమా ఓటీటీ లో కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 25, ఆదివారం, 2021
Advertisement

తాజా వార్తలు