ఎన్టీఆర్ ' గారు ' అని పిలిస్తే ఇక వారి పని అయిపోయినట్టేనా ? చరిత్ర ఏం చెబుతోంది ?

సీనియర్ ఎన్టీఆర్.తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్రమశిక్షణకు ఆయన మారుపేరు.

కష్టానికి, పట్టుదలకి, వినయానికి కూడా ఎన్టీఆర్ పర్యాయపదం అనే చెప్పాలి.నిమ్మకూరులో పాల వ్యాపారం చేసిన ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, తెలుగు ఇండస్ట్రీలో తిరుగులేని హీరోగా, వ్యక్తిత్వంలో ఉన్నతంగా ఉండడం ఆయన ఒక్కడికే చెల్లింది.

ఆయనతో విభేదం వచ్చిందంటే చాలు ఇండస్ట్రీ రెండు ముక్కలైంది అనే భావన వచ్చేది.సాధారణంగా ఎన్టీఆర్ ఎవరిని దూరం చేసుకోరు.

కానీ సినిమా ఇండస్ట్రీ అన్నాక వైరం చాలా మామూలు విషయం.అందుకే కొన్ని ఏళ్ల పాటు ఆయనకి కొంతమందితో వైరం నడిచిందని మనందరికీ తెలిసిన విషయమే.

Advertisement
Untold Facts About Sr Ntr And Sakshi Rangarao Details, Ntr, Sakshi Rangarao, Ntr

ఎన్టీఆర్ విషయంలో మరొక వింత రూమర్ కూడా ప్రచారంలో ఉండేది నాటి రోజుల్లో.ఆయన మొదటిసారి ఏ నటుడుతో ఆయన పరిచయమైతే చెప్పండి బ్రదర్ అని సంబోధిస్తారు.అంతేకానీ పేరు పెట్టి పిలవడం జరగదు అయితే ఆయన ఎవరినైనా "గారు" అని సంభోదించారంటే మాత్రం వారికి ఎన్టీఆర్ దూరంగా ఉండాలని భావిస్తున్నట్టు ఒక రూమర్ ఉండేది.90% నిజం ఉంది అని అప్పట్లో అందరూ నమ్మేవారు.ఎందుకంటే ఆయన గారు అని పిలిచిన వారందరూ కూడా తర్వాత రోజుల్లో ఎన్టీఆర్ కి దూరంగా వెళ్లిపోయారట దీనికి ఉదాహరణగా చాలామంది నటులు ఉన్నారు.

Untold Facts About Sr Ntr And Sakshi Rangarao Details, Ntr, Sakshi Rangarao, Ntr

అయితే సాక్షి రంగారావు విషయంలో ఒక వింత జరిగింది.సాక్షి రంగారావు ఎక్కువగా కృష్ణ కి సంబంధించిన వర్గంలో నటించారు.ఆయన సినిమాల్లో ఎక్కువగా కనిపించేవారు.

దాంతో ఒకరోజు ఎన్టీఆర్, కృష్ణతో కలిసి సాక్షి రంగారావు ఉండడానికి గమనించారు.రంగారావు కి ఎన్టీఆర్ అంటే ఎంతో గౌరవం.

అన్న ఎన్టీఆర్ దగ్గరికి రాగానే సాక్షి రంగారావు నమస్కరించారట.దాంతో ఎన్టీఆర్ రంగారావు గారు అంటూ మళ్ళీ పలకరించారట.

Untold Facts About Sr Ntr And Sakshi Rangarao Details, Ntr, Sakshi Rangarao, Ntr
అక్కినేని ఫ్యామిలీ నుంచి స్టార్ హీరో రాలేడా..?
రాజమౌళి సినిమాలో చేయడానికి ఆర్టిస్టులు ఎందుకు ఉత్సాహాన్ని చూపిస్తారు...

ఇక అంతే సాక్షి రంగారావుకి గుండె ఆగినంత పనైంది.ఇప్పుడే పరిచయమయ్యాను అప్పుడే గారు అనేసారంటే తనను దూరం పెట్టాలని భావిస్తున్నారా ఏంటి అని తలలో తానే మధుర పడ్డారట సాక్షి రంగారావు.కానీ ఆ తర్వాత ఆయన్ని దగ్గరికి పిలిపించుకొని ఆయన గతంలో చేసిన సినిమాల గురించి నాటకాల గురించి అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారట.

Advertisement

అంతేకాదు ఆయన ముఖ్యమంత్రి అయ్యాక తెలుగు భాషాభివృద్ధి మండలికి చైర్మన్ గా సాక్షి రంగారావుని పెట్టాలని అన్నగారు భావించారట.ఎందుకంటే ఆయన తెలుగు ఉచ్చారణ అద్భుతంగా ఉంటుంది.

కానీ కొన్ని రాజకీయ కారణాల వల్ల అది కుదరలేదు.

తాజా వార్తలు