చంటిబిడ్డ‌తో సభకు వచ్చిన ఎంపీ ... అధికారుల ఆగ్రహం, చట్టాలు మార్చాలంటూ బ్రిటన్‌లో పెద్ద చర్చ

ఈ భూమ్మీద ఏ ప్రాణీకైనా కన్నబిడ్డ కంటే ఏది ఎక్కువ కాదు.ఇందుకు మనిషి కూడా అతీతం కాదు.

బిడ్డల భవిష్యత్ కోసం రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడేవారు ఎందరో.సవాలక్ష పనుల్లో బిజీగా వున్నా మనసు మాత్రం పిల్లల దగ్గరే వుంటుంది.

అలా అని కార్యాలయాల వద్దకు, పనిచేసే చోటికి పిల్లలను తీసుకెళ్లడం సాధ్యం కాదు కదా.ఇప్పుడు ఇదే విషయమై బ్రిటన్‌లో పెద్ద చర్చ నడుస్తోంది.వివరాల్లోకి వెళితే.

ప్రతిపక్ష లేబ‌ర్ పార్టీకి చెందిన స్టెల్లా క్రేజీ అనే ఎంపీ త‌న నెలలబిడ్డ‌ను తీసుకుని ఇటీవల పార్ల‌మెంట్ స‌మావేశాల‌కు హాజ‌ర‌య్యారు.అయితే దీనిని గ‌మ‌నించిన పార్ల‌మెంట్ సిబ్బంది.

Advertisement
Uk Mp Stella Calls For Reform Of Parliament Baby Ban , Stella , Parliament, Brit

బిడ్డతో సభలోకి హాజరయ్యేందుకు అనుమతి లేదని ఆమెను అడ్డుకున్నారు.దీంతో నొచ్చుకున్న ఆమె ట్విట్ట‌ర్ వేదిక‌గా తీవ్ర ఆగ్రహం వ్య‌క్తం చేశారు.

తమ తోటి ఎంపీకి జరిగిన అవమానం పట్ల సహచర సభ్యులు కూడా స్పందించారు.ఆమెను అడ్డుకున్న స‌దురు అధికారులపై అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.

విషయం స్పీక‌ర్ వరకు వెళ్లడంతో స‌ర్ లిండ్సే కూడా స్పందించారు.త‌ల్లిపాత్ర‌లో ఉన్న ఎంపీలు కూడా పార్ల‌మెంట్ స‌మావేశాల్లో పాల్గొన‌డం చాలా ముఖ్య‌మ‌ని, చ‌ట్టాలు చేయ‌డంలో వారి పాత్ర కూడా ఉండాల‌ని స్పీకర్ చెప్పారు.

ప్ర‌స్తుత కాలానికి అనుగుణంగా పాత నిబంధనలను ఒకసారి సమీక్షించాలని స్పీకర్ అధికారుల‌ను కోరారు.అంతేకాదు పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లోని న‌ర్స‌రీ వున్న విషయాన్ని కూడా దృష్టిలో వుంచుకోవాలని ఆదేశించారు.

చిరు, బాలయ్య రిజెక్ట్ చేసిన డైరెక్టర్ కు నాగార్జున ఛాన్స్ ఇస్తారా.. ఏమైందంటే?
పాన్ ఇండియాలో మన ఇండస్ట్రీ ని నెంబర్ వన్ గా నిలిపే హీరోలు వీళ్లేనా..?

ఈ వ్యవహారంపై బ్రిట‌న్ ప్ర‌ధానమంత్రి బోరిస్ జాన్స‌న్ కూడా స్పందించారు.కొత్తగా పార్లమెంట్‌కు ఎంపికైన స‌భ్యుల్లో త‌ల్లిదండ్రులైన వారు కూడా ఉన్న‌ారని తెలిపారు.

Advertisement

వారిని కనిపెట్టుకుని ఉండాల్సిన బాధ్య‌త కూడా త‌మ‌పై ఉంద‌ని ప్రధాని వ్యాఖ్యానించారు.స్టెల్లా మాదిరిగానే గ‌తంలోనూ ఓ ఎంపీ ఓ చంటిబిడ్డ‌తో పార్లమెంట్ స‌మావేశాల‌కు హాజ‌ర‌య్యారు.

జోన్స్‌విన్స‌న్ అనే ఎంపీ 2018లో త‌న చంటిబిడ్డ‌తో హాజ‌ర‌య్యారు.ఈ ఘటనను ఎలా మ‌రిచిపోయార‌ని కొంద‌రు ఎంపీలు పార్ల‌మెంట్ అధికారుల‌కు గుర్తుచేస్తున్నారు.

కాగా.గతంలో బ్రిటన్ కేబినెట్‌లో జూనియర్ మంత్రులు మాత్రమే పిల్లలు పుట్టాక సెలవులు తీసుకోవడానికి వీలుండేది.కొత్త బిల్లు ప్రకారం.

కేబినెట్ స్థాయి మంత్రులు కూడా సెలవు తీసుకునే వెసులుబాటు కలిగింది.అయితే ఇది ప్రధాన మంత్రి విచక్షణతో మంజూరు చేయబడుతుంది.

యూకే రెగ్యులర్ ఉద్యోగులకు వర్తించే సాధారణ నియమాల ప్రకారం.శిశివు జన్మించిన నాటి నుంచి 52 వారాల‌ పాటు మహిళలు ప్రసూతి సెలవులకు అర్హులు.

ఇక పితృత్వ సెలవుల విషయానికి వస్తే.తండ్రులు రెండు వారాల పాటు చట్టబద్ధమైన సెలవు తీసుకోవచ్చు.

దీనిలో భాగంగా భారత సంతతికి చెందిన బ్రిటీష్ కేబినెట్ మంత్రి సుయెల్లా బ్రావర్‌మెన్.ప్రసూతి సెలవు తీసుకున్న తొలి బ్రిటన్ కేబినెట్ మంత్రిగా రికార్డుల్లోకెక్కారు.

రెండవ బిడ్డకు జన్మనిచ్చిన ఆరు నెలల తర్వాత సెప్టెంబర్‌లో అటార్నీ జనరల్‌గా తిరిగి పదవి బాధ్యతలు స్వీకరించారు.

తాజా వార్తలు