శ్రీవారి భక్తులకు అద్భుతమైన అవకాశం జనవరి నెల అర్జిత సేవ టికెట్లు నేడే విడుదల.. ప్రత్యేక దర్శన టికెట్లు ఎప్పుడంటే..

దేశవ్యాప్తంగా చాలా మంది ప్రజలు ప్రతిరోజు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి లక్షల్లో వస్తూ ఉంటారు.ఆయన సేవలో ప్రత్యక్షంగా పాల్గొనాలనీ ఆశించిన భక్తులకు ఇది శుభవార్త అని చెప్పాలి.

జనవరి నెల కు సంబంధించిన అర్జిత సేవ టికెట్లను ఈరోజు ఆన్లైన్లో తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసే అవకాశం ఉంది.2023 జనవరి నెల కు సంబంధించిన తిరుమల శ్రీవారి అర్జితసేవ టికెట్ల కోటాను ఈరోజు విడుదల చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు ఈ అర్చిత సేవా టికెట్లను ఆన్లైన్లో మాత్రమే విడుదల చేసే అవకాశం ఉంది.

ఈ విషయాన్ని భక్తులు గమనించి ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలని కూడా తెలిపింది.హర్షిత సేవా టికెట్లతో పాటు 2023 జనవరి నెల కు సంబంధించి మరికొన్ని ఆర్చిత సేవా టికెట్లను ఆన్లైన్ ద్వారా లక్కీ డిప్ నమోదు ప్రక్రియ కూడా ఈ రోజే మొదలుపెట్టనున్నారు.

అలాగే ఈరోజు ఉదయం 10:00 నుండి డిసెంబర్ 14న ఉదయం 10 గంటల వరకు ఈ అవకాశం ఉండే అవకాశం ఉంది.ఆ తర్వాత లక్కీ డిప్ టికెట్లను కేటాయించనున్నారు.

Ttd Board Arjita Seva Tickets For January Month Will Be Released Today Details,

అయితే ఈ టోకెన్లను కేవలం అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలని చెబుతున్నారు.ఇతర వెబ్సైట్లు లేదా దళారులను ఎట్టి పరిస్థితులలో నమ్మి మోసపోవద్దని కూడా హెచ్చరిస్తున్నారు.మధ్యాహ్నం 3 గంటలకు సరిగ్గా అర్చితా సేవా టికెట్లను విడుదల చేసే అవకాశం ఉంది.

Advertisement
Ttd Board Arjita Seva Tickets For January Month Will Be Released Today Details,

ఈనెల 16వ,31వ తేదీలలో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు డిసెంబర్ 13వ తేదీ ఉదయం 9 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైట్లో విడుదల చేసే అవకాశం ఉంది.ఈ విషయాన్ని కూడా భక్తులు గుర్తించుకోవాలని దేవస్థాన అధికారులు చెబుతున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి30, ఆదివారం 2025
Advertisement

తాజా వార్తలు