బిగ్ బాస్ సీజన్6 నుంచి తాజాగా ఇనయా సుల్తానా ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.లేడీ టైగర్ గా పేరు సంపాదించుకున్న ఇనయా సుల్తానాను ఎలిమినేట్ చేయడాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు.
అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ కొంతమంది నాగార్జున ఫ్యాన్స్ ఇనయా సుల్తానాను ట్రోల్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది.రేవంత్ కు గట్టి పోటీ ఇస్తుందని అనుకున్న ఇనయా సుల్తానా టాప్5 లో కూడా లేకపోవడం ఏంటని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
అయితే విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం వారానికి లక్ష రూపాయల చొప్పున ఇనయా సుల్తానా రెమ్యునరేషన్ ను అందుకున్నారు.14 లక్షల రూపాయల రెమ్యునరేషన్ ఇనయా సుల్తానాకు ఇచ్చారని ఈ రెమ్యునరేషన్ విషయంలో ఆమె హ్యాపీగానే ఉన్నారని తెలుస్తోంది.ఫినాలేకు వారం రోజుల ముందు ఇనయా ఎలిమినేట్ కావడంతో ఇకపై ఈ షో చూడబోమని కొంతమంది ఫ్యాన్స్ చెబుతున్నారు.

బిగ్ బాస్ షో నిర్వాహకులు ప్రేక్షకుల ఓటింగ్ కు ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఇష్టానుసారం ఎలిమినేషన్లు జరుగుతున్నాయని కొంతమంది నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.నాగార్జున సైతం తనపై వస్తున్న ట్రోల్స్ విషయంలో సీరియస్ గా ఉన్నారని తెలుస్తోంది.బిగ్ బాస్ సీజన్7 కు నాగ్ హోస్ట్ గా వ్యవహరించే అవకాశం అయితే లేదని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు.
ఒక సర్వేలో ఇనయ ఎలిమినేషన్ సరైనది కాదని 69 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేయగా 26 శాతం మంది సరైనదే అని 5 శాతం మంది మాత్రం చెప్పలేం అని అభిప్రాయం వ్యక్తం చేశారు.ఇనయా సుల్తానా ఎలిమినేషన్ పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తన ఎలిమినేషన్ గురించి ఇనయా సుల్తానా ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.బిగ్ బాస్ షో ద్వారా ఇనయా సుల్తానాకు ఊహించని రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.