ముల్తానీ మట్టితో స్కిన్ వైట్నింగ్ క్రీమ్.. ఇంట్లోనే ఈజీగా త‌యారు చేసుకోండిలా!

ముల్తానీ మట్టి.( Multani Mitti ) దీని గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు.

ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న సహజ చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో ముల్తానీ మట్టి ఒకటి.చాలా ఏళ్ల నుంచి సౌందర్య సాధనలో ముల్తానీ మట్టి ఉపయోగించబడుతుంది.

ప్రధానంగా చర్మ ఛాయను మెరుగుపరచడానికి ముల్తానీ మట్టి అద్భుతంగా సహాయపడుతుంది.మనలో చాలా మంది తెల్లగా మారడం కోసం మార్కెట్లో లభ్యమయ్యే రకరకాల స్కిన్ వైట్నింగ్ క్రీమ్ లను( Skin Whitening Cream ) కొనుగోలు చేసి వాడుతుంటారు.

ఆ క్రీముల కోసం వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు.

Advertisement

కానీ ముల్తానీ మట్టితో ఇప్పుడు చెప్పబోయే విధంగా ఇంట్లోనే క్రీమ్ తయారు చేసుకుని వాడితే స‌హ‌జంగానే తెల్లగా కాంతివంతంగా మెరిసిపోవచ్చు.మరి ఇంతకీ ముల్తానీ మట్టితో స్కిన్ వైట్నింగ్ క్రీమ్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ముల్తానీ మట్టి వేసుకోవాలి.

అలాగే రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్,( Aloevera Gel ) వన్ టేబుల్ స్పూన్ మీ రెగ్యులర్ మాయిశ్చరైజర్ క్రీమ్, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్,( Lemon Juice ) వన్ టేబుల్ స్పూన్ గ్లిజరిన్, చిటికెడు ఆర్గానిక్ పసుపు మరియు రెండు టేబుల్ స్పూన్లు రోజ్ వాటర్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.తద్వారా మన క్రీమ్ అనేది సిద్ధమవుతుంది.

ఈ క్రీమ్ ఒక బాక్స్ లో నింపుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.రోజు నైట్ నిద్రించే ముందు ఫేస్ వాష్ చేసుకుని తయారు చేసుకున్న క్రీమ్ ను ముఖానికి అప్లై చేసుకోవాలి.పూర్తిగా డ్రై అయిన తర్వాత నిద్రించాలి.

ఈ విధంగా నిత్యం చేస్తే స్కిన్ టోన్ క్రమంగా ఇంప్రూవ్ అవుతుంది.చ‌ర్మంపై ఎలాంటి మొండి మచ్చలు ఉన్న తగ్గు ముఖం పడతాయి.

యశ్ టాక్సిక్ సినిమాలో స్టార్ హీరోయిన్.... అధికారిక ప్రకటన వెల్లడి!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 25, ఆదివారం, 2021

ముడతలు ఉంటే దూరం అవుతాయి.చర్మం కాంతివంతంగా, అందంగా మెరుస్తుంది.

Advertisement

ముఖాన్ని వైట్ గా బ్రైట్ గా మెరిపించుకోవాల‌ని భావిస్తున్న వారు తప్పకుండా ఈ క్రీమ్ ను ట్రై చేయండి.

తాజా వార్తలు