మరోసారి డొనాల్డ్ ట్రంప్‌ కు త్రుటిలో తప్పిన ముప్పు.. విమానం అత్యవసర ల్యాండింగ్..

కొద్దిరోజుల క్రితం అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు( Donald Trump ) తృటిలో పెను ప్రమాదం తప్పిన సంగతి అందరికీ వివిధమే.

ఈ ఘటనలో ఆయనకి కాల్పుల సమయంలో అతడి కుడి చెవికి బుల్లెట్ తగలడంతో రక్తం వచ్చింది.

రిపబ్లిక్ అభ్యర్థిగా పెనిస్లేవియాలోని బట్లర్ లో ఏర్పాటు చేసిన ర్యాలీలో ఈ ఘటన చోటుచేసుకుంది.అయితే అదృష్టవశాత్తు అతడికి ఆ ఘటనలో స్వల్ప గాయంతో బయటపడటంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.

దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నట్లు అయింది.ఇకపోతే తాజాగా ఆయనకు మరో ప్రమాదం నుండి బయటపడ్డాడని చెప్పవచ్చు.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.తాజాగా ట్రంప్ ప్రయాణం చేయాల్సిన విమానంలో మెకానికల్ ఇష్యూ( Mechanical Issue ) రావడంతో బిల్డింగ్స్ లో ఆయన విమానం అత్యవసర ల్యాండింగ్( Emergency Landing ) చేయాల్సి వచ్చింది.బోస్ మన్ టౌన్ సమీపంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.

Advertisement

ఎన్నికల ప్రచార నేపథ్యంలో ఆయన విమాన ప్రయాణం చేయాల్సి ఉండగా.మెకానికల్ సమస్య తనతో వెంటనే విమానాన్ని బిల్లింగ్స్ లోగాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో( Logan International Airport ) ల్యాండ్ చేశారు అధికారులు.

అది ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని ఎయిర్పోర్ట్ స్టాఫ్ ప్రకటించింది.ఇక అక్కడ నుంచి ట్రంప్ ఓ ప్రైవేట్ వాహనంలో బోజ్మల్ లో జరగాల్సిన ర్యాలీకి వెళ్లినట్లు సమాచారం.ఇకపోతే బుల్లెట్ దాడిలకు సంబంధించి ఓ వ్యక్తిని హతమార్చిన సంగతి విధితమే.

అలాగే పాకిస్తాన్ చెందిన మరో వ్యక్తి అమెరికాలోని పలువురు రాజకీయ నాయకులను మట్టుపెట్టాలని ప్లాన్ చేసిన విషయంలో అతడిని అధికారులు అరెస్టు చేశారు.

హమ్మో, ఎగిరే కారు వచ్చేసింది.. వీడియో చూస్తే మైండ్ బ్లాక్!!
Advertisement

తాజా వార్తలు