వలసదారులకు షాకిచ్చిన ట్రంప్.. 5 లక్షల మందిపై వేటు, నెల రోజులు గడువు

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్( President Donald Trump ) బాధ్యతలు స్వీకరిస్తున్న నాటి నుంచి వలసదారులు ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని భయపడుతున్నారు.

ఇప్పటికే అక్రమంగా దేశంలో నివసిస్తున్న విదేశీయులను బహిష్కరిస్తున్న ఆయన హెచ్ 1 బీ వీసా( H1-B Visa ) వ్యవస్థలోనూ సమూల మార్పులు తీసుకొస్తున్నారు.

తాజాగా తాత్కాలిక వలసదారులపై ట్రంప్ కొరడా ఝళిపించారు.అమెరికా వ్యాప్తంగా ఉన్న దాదాపు 5 లక్షల మందికి పైగా వలసదారులకు తాత్కాలిక నివాస హోదాను( Temporary Status ) రద్దు చేస్తున్నట్లు యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంలాండ్ సెక్యూరిటీ సంచలన ప్రకటన చేసింది.

Trump Administration Revokes Temporary Status For 532000 Immigrants Details, Tru

క్యూబా, హైతీ, నికరాగ్వా, వెనెజులా దేశాలకు చెందిన వలసదారులకు ఉన్న తాత్కాలిక నివాస హోదాను రద్దు చేస్తున్నట్లు హోంలాండ్ సెక్యూరిటీ తెలిపింది.2022 అక్టోబర్ తర్వాత ఈ నాలుగు దేశాల నుంచి వచ్చిన 5,32,000 మందిపై వేటు పడనుంది.నెల రోజుల్లో వారిని అమెరికా నుంచి బహిష్కరిస్తామని పేర్కొంది.

వీరంతా మానవతా పెరోల్ కార్యక్రమంలో భాగంగా అమెరికాకు వచ్చారని హోంలాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టి నోయెమ్( Homeland Security Secretary Kristi Noem ) వెల్లడించారు.వీరు రెండేళ్ల పాటు అమెరికాలో నివసించడానికి , ఉపాధి పొందడానికి అనుమతులు ఉన్నాయని క్రిస్టీ తెలిపారు.

Advertisement
Trump Administration Revokes Temporary Status For 532000 Immigrants Details, Tru

ఫెడరల్ రిజిస్టర్‌లో నోటీసులు ప్రచురించిన 30 రోజుల తర్వాత వీరంతా అమెరికాలో ఉండే హక్కును కోల్పోతారని క్రిస్టీ వెల్లడించారు.

Trump Administration Revokes Temporary Status For 532000 Immigrants Details, Tru

కాగా.మానవతా పెరోల్‌ను కొందరు దుర్వినియోగం చేస్తున్నారని తాను అధ్యక్షుడిగా ఎన్నికైన వెంటనే దీనిపై చర్యలు తీసుకుంటానని ట్రంప్ గతంలోనే వెల్లడించారు.ఈ మానవతా పెరోల్ కింద ఆయా దేశాలలో యుద్ధం, సంక్షోభం వున్న వారు అమెరికాకు వచ్చి తాత్కాలికంగా నివాసం ఉండేందుకు వీలు కల్పిస్తారు.

మానవతా పెరోల్ కింద అమెరికాకు వచ్చిన వారు రెండేళ్ల పాటు చట్టబద్ధంగా ఉపాధి పొందవచ్చు.ఒకవేళ గడువు ముగిస్తే శరణార్ధి లేదా వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ దరఖాస్తు ప్రక్రియను నిలిపివేశారు.ఇప్పుడు ఏకంగా నెల రోజుల్లోగా దేశం నుంచి వెళ్లిపోవాల్సి రావడంతో వలసదారులు ఆందోళన చెందుతున్నారు.

ఎఫ్‌బీఐలో భారత సంతతి మహిళకు కీలక పదవి.. ఎవరీ షోహిణి సిన్హా?
Advertisement

తాజా వార్తలు