పుష్ప 'శ్రీవల్లి' లుక్ పై సోషల్ మీడియాలో రచ్చ!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా గ్లామర్ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప.

అల్లు అర్జున్ మొదటిసారి పాన్ ఇండియా సినిమాలో చేస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

తాజాగా ఈ సినిమా నుండి రష్మిక మందన్న లుక్ ను రివీల్ చేసిన విషయం తెలిసిందే.ఈ సినిమాలో రష్మిక పుష్పరాజ్ భార్యగా శ్రీవల్లి పాత్రలో నటిస్తుంది.

ఈమె పాత్రను పరిచయం చేస్తూ రష్మిక గ్లామర్ స్టిల్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్.రష్మిక మాస్ లుక్ లో కనిపించ బోతుందని ముందు నుండే సమాచారం.

ఇక ఈ స్టిల్ విడుదల అయినా తర్వాత అంత అనుకున్న విధంగానే రష్మిక మాస్ పాత్రలో కనిపించబోతుంది.

Trolls On Rashmika Srivalli Look In Pushpa Movie, Pushpa, Rashmika Mandanna, All
Advertisement
Trolls On Rashmika Srivalli Look In Pushpa Movie, Pushpa, Rashmika Mandanna, All

ఇక రష్మిక ఈ లుక్ లో బాగుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు కానీ ఈ స్టిల్ విడుదల చేయడం మాత్రం నచ్చలేదని అభిమానులు అంటున్నారు.సుకుమార్ రష్మిక ఈ స్టిల్ కాకుండా మరేదైనా స్టిల్ ను ఫస్ట్ లుక్ గా విడుదల చేసి ఉంటే బాగుండేది అని నెటిజెన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.ఆమె లుక్ అయితే బాగుంది కానీ చూపించిన విధానం సరిగా లేదని ఆ ఫోజ్ కాకుండా వేరేది ఏది అయినా బాగుండేది అని అంటున్నారు.

Trolls On Rashmika Srivalli Look In Pushpa Movie, Pushpa, Rashmika Mandanna, All

రంగస్థలం అప్పుడు సమంత లుక్ చూసి అందరు ఫిదా అయ్యారు.కానీ ఇప్పుడు మాత్రం రష్మిక ఆ ఫోజ్ లో ఉండడం చూసి ఎవరికీ వారు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేస్తున్నారు.మొత్తానికి ఇలా రష్మిక లుక్ పై నెటిజెన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.

ఇక అల్లు అర్జున్ కూడా ఈ సినిమాలో ఫుల్లీ మాస్ లుక్ అవవడంతో రష్మిక పుష్పరాజ్ పక్కన బాగా సెట్ అవుతుందని అనుకుంటున్నారు.

రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?
Advertisement

తాజా వార్తలు