టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ( Siddhu Jonnalagadda ) నటించినటువంటి తాజా చిత్రం టిల్లు స్క్వేర్( Tillu Square ).
డిజె టిల్లు సినిమాకు సీక్వెల్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది.
ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టి మంచి సక్సెస్ కావడంతో చిత్ర బృందం హైదరాబాదులో ఈ సినిమా సక్సెస్ ఈవెంట్ నిర్వహించారు.ఇక ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్( NTR ) త్రివిక్రమ్ వంటి వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
సిద్దు సినిమా ఈవెంట్ అయినప్పటికీ ఈ వేదిక మాత్రం పెద్ద ఎత్తున దేవరనామ స్మరణలతో మారి మోగిపోయిందని చెప్పాలి.ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) సైతం దేవర సినిమా( Devara Movie ) గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఈ సందర్భంగా త్రివిక్రమ్ మాట్లాడుతూ.
ముందుగా 100 కోట్ల క్లబ్ లో చేరిన సిద్ధుకి కంగ్రాట్స్ అని చెప్పుకొచ్చాడు.ఈ సినిమా టిల్లు స్క్వేర్ మాత్రమే కాదు రాధిక స్క్వేర్ కూడా అని అన్నాడు.
ఈ సినిమా కోసం ఈయన పడిన కష్టాన్ని త్రివిక్రమ్ ఈ సందర్భంగా తెలియజేస్తూ అభినందనలు వెల్లడించారు.
ఇక ఎన్టీఆర్ ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ రేపటి నుంచి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది ఈ ఏడాది దేవర నామ సంవత్సరంగా ప్రకటిస్తున్నానని త్రివిక్రమ్ అన్నాడు.ఈ 100 పక్కన ఇంకో సున్నా పెట్టి.ఆయన దేవర( Devara ) నామ సంవత్సరాన్ని మొదలు పెట్టాలని మీ అందరి తరపున మనందరి తరపున, ఎన్టీఆర్ కంటే కొంచెం పెద్దవాడిని కాబట్టి ఆశీర్వదిస్తున్నానని త్రివిక్రమ్ దేవర సినిమా గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy