యాడ్ లలో నటిస్తున్న ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్.... అందుకేనా.?

తెలుగులో ఒకప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన  "ఖుషి" చిత్రంలో తన అందం, అభినయం, నటనా ప్రతిభతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న హీరోయిన్ "భూమిక చావ్లా" గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

అయితే భూమిక చావ్లా వచ్చీరావడంతోనే మంచి హిట్ ని అందుకోవడంతో కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాస్ మహారాజా రవితేజ, మెగాస్టార్ చిరంజీవి తదితర స్టార్ హీరోల చిత్రాల్లో నటించే అవకాశం దక్కించుకుంది.

అయితే పలు వ్యక్తిగత కారణాల వల్ల కొంత కాలం పాటు సినీ పరిశ్రమకు దూరంగా వెళ్ళిపోయింది. దాంతో భూమిక కి మళ్లీ కంబ్యాక్ లభించలేదు.

Tollywood Yesteryear Heroine Bhumika Chawla Acting In Adds, Bhumika Chawla, Tol

అయితే తాజాగా భూమిక చావ్లా తాను షూటింగ్ లో పాల్గొంటున్న సమయంలో తీసుకున్నటువంటి ఓ ఫోటో ని తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసింది.దీంతో ఓ నెటిజన్  అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ ఓ యాడ్ లో నటిస్తున్నట్లు తెలిపింది.

దీంతో కొందరు నెటిజనులు ఈ విషయాన్ని తెగ ట్రోల్స్  చేస్తున్నారు.అంతేగాక ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగొంది ప్రస్తుతం ప్రకటనలు మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలకి భూమిక చావ్లా పరిమితమైందని అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

అయితే ఈ విషయం ఇలా ఉండగా భూమిక చావ్లా ఇటీవలే టాలీవుడ్ లెజెండ్ నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా నటించిన "రూలర్" చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించింది. కాగా ప్రస్తుతం భూమిక తెలుగులో ప్రముఖ దర్శకుడు సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న "సీటీ మార్" అనే చిత్రంలో నటిస్తోంది.

  కాగా ఈ చిత్రంలో హీరోగా టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ నటిస్తుండగా ప్రముఖ కబడ్డీ కోచ్ జ్వాలా రెడ్డి  పాత్రలో టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా నటిస్తోంది.

Advertisement

తాజా వార్తలు