టాలీవుడ్ సీనియర్ హీరోల ఆస్తుల లేటెస్ట్ లెక్కలు ఇవే.. ఏ హీరో ఆస్తుల విలువ ఎంతంటే?

టాలీవుడ్ స్టార్ హీరోలకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు.టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యునరేషన్లకు సంబంధించిన వేర్వేరు వార్తలు తరచూ ప్రచారంలోకి వస్తుంటాయి.

అయితే గత కొన్నేళ్లలో టాలీవుడ్ స్టార్ హీరోల ఆస్తుల విలువలు సైతం ఊహించని స్థాయిలో పెరిగాయి.చాలామంది స్టార్ హీరోలు రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెడుతూ, వ్యాపారాలలో పెట్టుబడులు పెడుతూ తమ ఆస్తులను పెంచుకుంటున్నారు.

స్టార్ హీరోల బ్రాండ్ వాల్యూ సైతం అమాంతం పెరుగుతుండటం గమనార్హం.టాలీవుడ్ స్టార్ హీరోల నికర ఆస్తుల విలువ వేల కోట్ల రూపాయలు అని సమాచారం.

మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) ప్రస్తుతం సీనియర్ హీరోలలో ఎక్కువ పారితోషికం అందుకుంటున్న హీరో కాగా ఈ స్టార్ హీరో మొత్తం ఆస్తుల విలువ ఏకంగా 5000 కోట్ల రూపాయలు సమాచారం.హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో చిరంజీవికి ఖరీదైన స్థలాలు ఉన్నాయి.

Tollywood Senior Star Heroes Assets Value Chiranjeevi Balakrishna Venkatesh Naga
Advertisement
Tollywood Senior Star Heroes Assets Value Chiranjeevi Balakrishna Venkatesh Naga

మరో స్టార్ హీరో నందమూరి బాలకృష్ణకు( Nandamuri Balakrishna ) తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తులతో పాటు సంపాదించిన ఆస్తులు కలిపితే ఆ ఆస్తుల విలువ 4000 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.బాలయ్య పారితోషికం ప్రస్తుతం 20 నుంచి 25 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్( Venkatesh ) సైతం ఊహించని స్థాయిలో ఆస్తులు కూడబెట్టారని సమాచారం.

Tollywood Senior Star Heroes Assets Value Chiranjeevi Balakrishna Venkatesh Naga

ఈ స్టార్ హీరో ఆస్తుల విలువ 6000 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది.సీనియర్ హీరో నాగార్జున( Nagarjuna ) ఆస్తుల విలువ 5500 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉంది.సినిమాలు, వ్యాపారాలతో పాటు బుల్లితెర షోల ద్వారా కళ్లు చెదిరే స్థాయిలో నాగ్ సంపాదిస్తున్నారు.

యంగ్ జనరేషన్ స్టార్ హీరోల ఆస్తుల విలువ 2000 నుంచి 3000 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది.యంగ్ జనరేషన్ హీరోలు తమ సంపాదనను మల్టీప్లెక్స్ లు, రెస్టారెంట్లు, రియల్ ఎస్టేట్, పొలాల కొనుగోలుపై ఇన్వెస్ట్ చేస్తున్నారు.

నాన్న చనిపోయినప్పుడు ఏడుపు రాలేదన్న థమన్.. ఆయన చెప్పిన విషయాలివే!
Advertisement

తాజా వార్తలు