కనుమరుగవుతున్న హీరోయిన్లకు.. అవకాశాలు ఇచ్చి ఆదుకుంటున్న సీనియర్ హీరోలు?

ఇండస్ట్రీలో దశాబ్దకాలంపాటు స్టార్ హీరోయిన్లు గా కొనసాగిన వారు ఆ తర్వాత యువ హీరోయిన్ల రాకతో సీనియర్ హీరోయిన్గా ముద్ర వేసుకుంటూ ఉంటారు.

ఇక ఇలా సీనియర్ హీరోయిన్ అనే ముద్ర పడింది అంటే ఇక యువ హీరోల సరసన ఛాన్సులు రావడం చాలా కష్టం.

కేవలం సీనియర్ హీరోలు మాత్రమే తమ సినిమాల్లోకి ఇలా థర్టీ ప్లస్ హీరోయిన్లను తీసుకుంటూ ఉంటారు.ఇక ప్రస్తుతం తమన్నా సహా ఎంతో మంది హీరోయిన్లు అందం అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్నప్పటికీ అవకాశాలు మాత్రం అంతగా అందుకోలేక పోతున్నారు.

అంతేకాదు ఫేడవుట్ హీరోయిన్లుగా పేరు తెచ్చుకుంటున్నారు.ఇక ఇలాంటి హీరోయిన్లకు మళ్లీ చాన్స్ లు ఇస్తూ ఫామ్లోకి తీసుకువచ్చేందుకు రెడీ అయిపోతున్నారు సీనియర్ హీరోలు.

ఇలా ఛాన్సులు దక్కించుకున్న సీనియర్ హీరోయిన్లు ఎవరో తెలుసుకుందాం.సోనాల్ చౌహాన్ : సీనియర్ హీరోయిన్ గా ముద్రపడిన ఈ అమ్మడు ఇండస్ట్రీలో ప్రేక్షకులను పలకరించి 13 ఏళ్ళు అయిపోతుంది బాలకృష్ణ సరసన డిటెక్టర్, రూలర్ లాంటి సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ.ఈ సినిమాలు పెద్దగా విజయం సాధించకపోవడంతో ఆ తర్వాత అవకాశాలు దక్కించుకోలేక పోయింది.

Advertisement

ఇక పూర్తిగా చిత్ర పరిశ్రమలో కనుమరుగైపోయింది.ఇప్పుడు 13 ఏళ్ల తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది సోనాల్ చౌహాన్.

నాగార్జున ది గోస్ట్ సినిమాలో ఈ అమ్మడికి ఆఫర్ ఇచ్చాడు.అంతేకాకుండా ఎఫ్ 3 లో ఒక హీరోయిన్ గా చేస్తోంది సోనాల్ చౌహాన్.

ఇక ఈ అమ్మడుకి సినిమాలు బాగా కలిసివచ్చే అవకాశం ఉంది.

మిల్కీ బ్యూటీ తమన్నా : వన్నె తరగని అందం మిల్కీ బ్యూటీ తమన్నా సొంతం అయినప్పటికీ సీనియర్ హీరోయిన్ అంటూ ముద్ర పడటంతో ఇక యువ హీరోల సినిమాలో ఛాన్స్ దక్కించుకోలేక పోతుంది ఈ ముద్దుగుమ్మ.ఇలా అవకాశాలు లేక కనుమరుగవుతున్న సమయంలో మెగాస్టార్ చిరంజీవి భోళాశంకర్ అనే సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చాడు.చిరంజీవి సినిమా అన్నాక మళ్ళీ క్రేజ్ పెరగ కుండా ఉంటుందో చెప్పండి.

బన్నీ, విష్ణు పక్కనున్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా.. ఈ సీరియల్ నటుడిని గుర్తు పట్టలేరుగా!
హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!

శృతిహాసన్ : మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ తో సినిమాలని దూరం పెట్టేసింది ఈ ముద్దుగుమ్మ.ఇక ఇటీవలే రవితేజ క్రాక్ సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చింది.ఈ హీరోయిన్ మళ్ళీ ఇండస్ట్రీలో రాణించగలదా అని అందరూ అనుకున్నారు.

Advertisement

కానీ క్రాక్ సినిమాతో హిట్ కొట్టిన ఈ ముద్దుగుమ్మ తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన ఛాన్స్ కొట్టేసింది.ఇక బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలోనూ అవకాశం దక్కించుకుంది.

తాజా వార్తలు