టాలీవుడ్ లో ఏ హీరో ఎంత డబ్బు విరాళాల ద్వారా పంచి పెట్టాడు

సినిమా తారలు. కేవలం తమ సినిమాల ద్వారా జనాలను సంతోషపరచడమే కాదు.

వారు కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలుస్తారు కూడా.గతంలో దివసీమ ఉప్పెన వచ్చి.

జనాలు వేల సంఖ్యలో చనిపోయారు.అన్ని ఆస్తులు కోల్పోయి కేవలం ప్రాణాలతో బయటపడ్డారు.

తినడానికి తిండి, ఉండటానికి ఇండ్లు లేక ప్రజలు అవస్థలు పడ్డారు.ఈ నేపథ్యంలో అలనాటి సినిమా తారలు ఎన్టీఆర్, ఏఎన్నార్ సహా పలువురు టాప్ నటులు భారీగా విరాళాలు సేకరించి బాధితులకు అండగా నిలిచారు.

Advertisement
Tollywood Heroes And Their Donations For Hyderabad In Floods, Tollywood Heroes ,

సేమ్ అదే సీన్ గత ఏడాది రిపీట్ అయ్యింది.గత 100 ఏండ్లలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ లో భారీ వర్షాలు కురిశాయి.

బస్తీలన్నీ జలమయం అయ్యాయి.ఇండ్లలోకి నీరు చేరి జనాలు రోడ్డున పడ్డారు.

రోడ్లన్నీ దెబ్బతిన్నాయి.లోతట్టు ప్రాంతాల ప్రజలు అవస్థలు పడ్డారు.

చాలా మంది ఆశ్రయం కోల్పోయారు.ఈ నేపథ్యంలో సినిమా తారలు రంగంలోకి దిగారు.

శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
బాలీవుడ్ హీరోతో సినిమాకి కమిట్ అవ్వనున్న ప్రశాంత్ వర్మ..

మన నగరాన్ని మనమే కాపాడుకుందాం అని ముందుకొచ్చారు.సీఎం రిలీఫ్ ఫండ్ కు భారీగా విరాళాలు ప్రకటించారు.

Tollywood Heroes And Their Donations For Hyderabad In Floods, Tollywood Heroes ,
Advertisement

ఇంతకూ ఏ హీరో ఎంత సాయం ప్రకటించారో ఇప్పుడు తెలుసుకుందాం.తెలుగు సినిమా పరిశ్రమ నుంచి ఈ కార్యక్రమానికి మొద‌ట‌గా బాల‌కృష్ణ కోటి 50 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను విరాళంగా ప్రకటించారు.అందరూ హైదరాబాద్ కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

ఆయన బాటలోనే పయణించారు మిగతా నటుల.

నాగార్జున 50 ల‌క్ష‌లు.చిరంజీవి, మ‌హేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ఒక్కొక్కరు కోటి రూపాయలు ప్రకటించారు.రామ్ 25 ల‌క్ష‌లు, విజ‌య దేవ‌ర కొండ‌ 10 ల‌క్ష‌లు విరాళం ఇచ్చారు.

మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్, దర్శకులు అనిల్ రావిపూడి, హ‌రిష్ శంక‌ర్ తలో 5 ల‌క్ష‌ల విరాళం అందజేశారు.కష్టాల్లో ఉన్న హైదరాబాదీయులకు అండగా నిలిచారు.ఏ ఆపద వచ్చినా ఆదుకుంటామని ప్రకటించారు.

సినిమా తార సాయం పట్ల పలువురు ప్రశంసలు కురిపించారు.

తాజా వార్తలు