నేడే వసంత పంచమి... బాసర సరస్వతి దేవి ఆలయానికి పోటెత్తిన భక్తులు!

ప్రతి సంవత్సరం మాఘ మాసం శుక్ల పక్షం పంచమి రోజున వసంత పంచమిని జరుపుకుంటారు.

ఈ క్రమంలోనే నేడు వసంత పంచమి కావడంతో పెద్ద ఎత్తున సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తున్నారు.

పురాణాల ప్రకారం వసంత పంచమి రోజున సరస్వతీ దేవి జయంతిగా జరుపుకుంటారు.అందుకే నేడు పెద్దఎత్తున సరస్వతి దేవి ఆలయానికి భక్తులు విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటారు.

అదే విధంగా ఎన్నోపాఠశాలలు కళాశాలలో కూడా నేడు సరస్వతి పూజలను నిర్వహిస్తుంటారు.ఇక నేడు వసంత పంచమి కావడంతో తెలంగాణలోని బాసర సరస్వతి దేవి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.

నేడు సరస్వతి దేవి దర్శనం చేసుకోవడం వల్ల అమ్మవారు సకల జ్ఞానాన్ని ప్రసాదిస్తారని భావిస్తారు.ఈ క్రమంలోనే ఎంతో మంది తల్లిదండ్రులు వారి పిల్లలతో పాటు బాసర చేరుకొని పిల్లలకు విద్యాభ్యాసం నిర్వహిస్తున్నారు.

Today Is Vasantha Panchami- Lot Of Devitees To The Basara Saraswati Devi Temple
Advertisement
Today Is Vasantha Panchami- Lot Of Devitees To The Basara Saraswati Devi Temple

శుక్రవారం రాత్రి నుంచి భక్తులు అమ్మవారి ఆలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు.శనివారం తెల్లవారుఝూమున 2 గంటలకు అర్చక స్వాములు అమ్మవారికి అభిషేకంతో ఉత్సవానికి అంకురార్పణ చేశారు.అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఈరోజు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.

ఇక అమ్మవారి ఆలయానికి చేరుకున్న భక్తులు అందరూ కరోనా నిబంధనలు పాటిస్తూ అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు