నేడే భారత్-వెస్టిండీస్ టెస్ట్ మ్యాచ్.. ఆ మూడు రికార్డులపై కన్నేసిన కోహ్లీ..!

వెస్టిండీస్ పర్యటనలో భాగంగా భారత్- వెస్టిండీస్ మధ్య రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ తో పాటు మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా నేడు వెస్టిండీస్-భారత్ మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ డొమానికా రిపబ్లిక్ లోని రోసో విండ్సర్ పార్క్ వేదికగా జరుగనుంది.

అయితే భారత జట్టు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ( Virat Kohli )మూడు సరికొత్త రికార్డులపై కన్నేశాడు.ఈ టెస్ట్ సిరీస్లలో విరాట్ కోహ్లీ బద్దలు కొట్టబోయే ఆ సరికొత్త రికార్డులు ఏమిటో చూద్దాం.

గత మూడు సంవత్సరాలుగా టెస్ట్ క్రికెట్లో అంతంత మాత్రంగా రాణిస్తూ, ఎన్నో విమర్శలను ఎదుర్కొన్న కోహ్లీకి తిరిగి తన సత్తా ఏంటో మరోసారి చూపించడానికి విండిస్ తో సీరీస్ వేదిక అయ్యే అవకాశం ఉంది.విరాట్ కోహ్లీ గత 25 టెస్టులలో కేవలం ఒకే ఒక సెంచరీ మాత్రమే నమోదు చేసి విమర్శల పాలు అయ్యాడు.

వెస్టిండీస్ ప్రత్యర్థిగా అత్యధిక పరుగులు:

గత సిరీస్ వరకు విరాట్ కోహ్లీ 3653 పరుగులు చేశాడు.వెస్టిండీస్ ప్రత్యర్థిగా అత్యధిక పరుగులు చేసిన రికార్డ్ సౌత్ ఆఫ్రికా ఆల్ రౌండర్ జాక్ కలిస్ పేరిట ఉంది.

జాక్ కలిస్ 4120 పరుగులు చేసి ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.విరాట్ కోహ్లీ 467 పరుగులు చేస్తే సరికొత్త రికార్డు ఖాతాలో పడుతుంది.

Advertisement

కరీబియన్ గడ్డపై అత్యధిక పరుగుల రికార్డు

: భారత జట్టు మాజీ ప్లేయర్, ప్రస్తుత భారత జట్టు చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ( Rahul Dravid )1838 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు.విరాట్ కోహ్లీ ఇప్పటివరకు కరీబియన్ గడ్డపై 1365 పరుగులు చేశాడు.మరో 473 పరుగులు చేస్తే ఈ జాబితాలో అగ్రస్థానానికి వెళ్తాడు.

వెస్టిండీస్ పై అత్యధిక సెంచరీల రికార్డ్: క్రికెట్ మూడు ఫార్మాట్లలోను అత్యధిక సెంచరీలు బాదిన రికార్డ్ ప్రస్తుతం ఏబీ డివిలియర్స్ పేరిట ఉంది.ఆ తర్వాతి స్థానంలో సునీల్ గవాస్కర్ కొనసాగుతున్నాడు.

విరాట్ కోహ్లీ మూడవ స్థానంలో ఉన్నాడు.అయితే వెస్టిండీస్( West Indies ) టూర్ లో భాగంగా కోహ్లీ టెస్ట్, వన్డే సిరీస్ లలో మూడు సెంచరీలు నమోదు చేస్తే ఈ జాబితాలో అగ్రస్థానానికి వెళ్తాడు.

ఇలా జరిగితే మూడు సరికొత్త రికార్డు బద్దలు అయి కోహ్లీ ఖాతాలో పడతాయి.

లక్కీ భాస్కర్ : భిన్నమైన కథే కానీ, అందరి బుర్రకెక్కుతుందో లేదో చూడాలి!
Advertisement

తాజా వార్తలు