టిక్ టాక్..
దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.సాధారణంగా ఉండే మనిషిని టిక్ టాక్ స్టార్ ని.సెలబ్రెటీని సాధారణంగా మార్చగలిగే శక్తి ఈ టిక్ టాక్ కి ఉంది.చైనా సృష్టించిన ఈ టిక్ టాక్ యాప్ లో జనాలు షేర్స్ కోసం, వ్యూస్ కోసం, లైక్స్ కోసం పరితపించి పోతుంటారు.
ఇంకా అలానే ఎంతో మంది ఎన్నో చోట్లా విన్యాసాలు చేసి ప్రాణాలు పోగొట్టుకున్నారు.
కొంతమంది అయితే ఈ టిక్ టాక్ లో వచ్చే హెల్త్ టిప్స్ అంటే కరోనా వైరస్ పై వచ్చిన కొన్ని హెల్త్ టిప్స్ ఉపయోగించి ఆసుపత్రి పాలయ్యారు కూడా.ఇంకా అలాంటి ఈ టిక్ టాక్ కి గతంలో ప్లే స్టోర్ లో 4.5 రేటింగ్ ఉంది.అయితే ఈ కరోనా వచ్చినప్పటి నుండి మన దేశం ఆర్ధికంగా వెనక ఉంది.

అందుకే స్వదేశీ వస్తువులే ఉపయోగించాలి అని చెప్పడం, ఇంకా ఈ యాప్ కు దారుణమైన వ్యతిరేక ప్రచారం జరగడం కారణంగా గూగుల్ ప్లే స్టార్ లో రేటింగ్ 4.5 నుండి 1.2కు పడిపోయింది.అయితే రాత్రికి రాత్రి ఎం జరిగిందో తెలియదు కానీ ఇప్పుడు తాజాగా టిక్ టాక్ రేటింగ్ 4.4 కి చేరింది.
రేటింగ్ పెరగడంలో గూగుల్ ప్లే స్టోర్ కీ రోల్ ప్లే చేసిందట.
1 స్టార్ రేటింగ్స్ ఇచ్చిన 80 లక్షల మంది రేటింగ్స్ ని గూగుల్ ప్లే స్టోర్ తొలిగించింది.దింతో టిక్ టాక్ రేటింగ్స్ మళ్లీ పుంజుకుని 4.4 కు పెరిగింది.అయితే సోషల్ మీడియాలో నెటిజన్లు అంత కూడా టిక్ టాక్, గూగుల్ ప్లే స్టోర్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు అని కామెంట్లు చేస్తున్నారు.