లోబీపీతో బాధ‌ప‌డుతున్నారా.. అయితే ఈ టిప్స్ మీ కోస‌మే!

లో బీపీ.నేటి కాలంలో చాలా మంది ఈ స‌మ‌స్యతో బాధ ప‌డుతున్నారు.

బీపీ సాధారణ స్థాయి కంటే బాగా త‌క్కువ‌గా ఉండ‌ట‌మే లోబీపీ అంటున్నారు.హై బీపీ ఎంత ప్ర‌మాద‌మో లోబీపీ కూడా అంతే ప్ర‌మాదం అన‌డంలో సందేహం లేదు.

Tips For How To Get Rid Of Low Blood Pressure! Low Blood Pressure, Blood Pressur

లోబీపీ వచ్చిన‌ప్పుడు శ‌రీరంలోని అన్ని అవ‌యవాల‌కు ర‌క్త స‌ర‌ఫ‌రా ఆగిపోతుంది.ఆ స‌మ‌యంలో ఒక్కోసారి గుండె పోటు, పక్షవాతం వంటి స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి.

ఇక లో బీపీ రావ‌డానికి చాలా కార‌ణాలు ఉన్నాయి.ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న శైలి, ర‌క్తం స‌రిప‌డా లేక‌పోవ‌డం, కొన్ని మందుల వాడ‌కం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల లోబీపీ ఏర్ప‌డుతుంది.

Advertisement

అయితే ఇప్పుడు చెప్ప‌బోయే టిప్స్ పాటిస్తే.లోబీపీ స‌మ‌స్య‌కు దూరంగా ఉండొచ్చు.

మ‌రి ఆల‌స్యం చేయ‌కుండా ఆ టిప్స్ ఏంటో చూసేయండి.లోబీపీ స‌మ‌స్య ఉన్న వారు గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ లేదా కాఫీ వంటివి తీసుకోవాలి.

ఎందుకంటే, ఇందులో పుష్ప‌లంగా ఉండే కెఫీన్ ర‌క్త పోటును అదుపులోకి తెస్తుంది.డీహైడ్రేష‌న్ వ‌ల్ల కూడా లోబీపీ వ‌స్తుంది.

కాబ‌ట్టి, ప్ర‌తి రోజు నీరు ఎక్కువ‌గా తీసుకోవాలి.మ‌రియు పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు కూడా ఎక్కువగా తీసుకుంటుండాలి.

ఇదేం కాంప్లిమెంట్ రా బాబోయ్.. పొగిడినట్టే పొగిడి భారతీయులను అవమానించిన ఆస్ట్రేలియా కపుల్..
ఇదేందయ్యా ఇది : చితికి మంటపెట్టగానే చనిపోయిన వ్యక్తి ఇలా చేశాడేంటి?

ఇక‌ విల‌మిన్ ఇ మ‌రియు విటిమ‌న్ బి12 లోబీపీ స‌మ‌స్య‌ను దూరం చేయ‌డంలో అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.కాబ‌ట్టి, ఆ విట‌మిన్లు ఉండే పాల‌కూర‌, గుడ్లు, పాలు, చేప‌లు, దుంప‌లు, న‌ట్స్ వంటి రెగ్యుల‌ర్‌గా తీసుకోవాలి.

Advertisement

అలాగే లోబీపీ ఉన్న వారు వెంట‌నే నీటితో కాస్త ఉప్పు క‌లిపి తీసుకోవాలి.ఇలా చేసినా బీపీ కంట్రోల్‌లోకి వ‌స్తుంది.

లోబీపీ స‌మ‌స్య‌ ఉన్న ‌వారు ఒకేసారి ఆహారం తీసుకోరాదు.రోజులో క‌నీసం ఐదారు సార్లు కొద్దిగా తీసుకుంటే.

ర‌క్త‌పోటు అదుపులో ఉంటుంది.లోబీపీ ఉన్న వారు ప్ర‌తి రోజు ఖ‌చ్చితంగా ఒక‌టి లేదా రెండు అర‌టి పండ్లు తీసుకోవాలి.

ఎందుకంటే, ఇందులో ఉండే పొటాషియం లోబీపీని నివారిస్తుంది.

తాజా వార్తలు