టిక్‌టాక్ ఛాలెంజ్‌ను సీరియస్‌గా తీసుకున్న యువకుడు.. చివరికి 80% గాయాలతో ఆసుపత్రి పాలు!

ఈ రోజుల్లో యువకులు సోషల్ మీడియా( Social Media ) పిచ్చిలో పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

కొందరు తీవ్ర గాయాల పాలై( Severely Injured ) నరకయాతన అనుభవిస్తున్నారు.

మరికొందరైతే ఏకంగా ప్రాణాలని కోల్పోతున్నారు.ఈ నేపథ్యంలోనే నార్త్ కరోలినాకి( North Carolina ) చెందిన ఒక బాలుడు సోషల్ మీడియా పిచ్చిలో పడి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.

ఈ అమెరికన్ కుర్రాడు టిక్‌టాక్ ఛాలెంజ్‌ను సీరియస్‌గా తీసుకొని చివరికి ఆసుపత్రి ఐసీయూలో చేరాడు.వివరాల్లోకి వెళితే.

నార్త్ కరోలినాలోని వేక్ ఫారెస్ట్‌కి చెందిన 16 ఏళ్ల బాలుడు మాసన్ డార్క్‌( Mason Dark ) స్నేహితులతో కలిసి టిక్‌టాక్ ఛాలెంజ్‌ని( TikTok Challenge ) పూర్తి చేద్దాం అనుకున్నాడు.అయితే ఈ ఛాలెంజ్ చేసే సమయంలో అతని శరీరంలో దాదాపు 80% భాగాలు కాలిపోయాయి.

Advertisement
TikTok Challenge Leaves Teen Disfigured In North Carolina Details, TikTok Challe

ఈ బాలుడు స్ప్రే పెయింట్ డబ్బాను, లైటర్‌ను ఉపయోగించి టార్చ్‌ను రూపొందించే ఛాలెంజ్ స్వీకరించాడు.అయితే అతడి ప్రయత్నం కాస్తా బెడిసి కొట్టింది.

ఫలితంగా పెయింట్ డబ్బా లైటర్‌ వల్ల ఒక్కసారిగా పేలిపోయింది.ఆ సమయంలో మాసన్‌కు నిప్పు అంటుకుంది.

Tiktok Challenge Leaves Teen Disfigured In North Carolina Details, Tiktok Challe

క్షణాల్లోనే అతడి శరీరం చాలా వరకు కాలిపోయింది.ప్రాణాలను కాపాడుకునేందుకు ఆ యువకుడు శరవేగంగా సమీపంలోని నదిలోకి దూకాడు.దీనివల్ల అతడు ప్రాణాలను రక్షించుకోగలిగాడు కానీ సంక్రమణ ప్రమాదం చాలా పెరిగింది.దీంతో అతడి పరిస్థితి మరింత దిగజారింది.

విషయం తెలుసుకున్న స్థానికులు హుటాహుటిన మాసన్‌ను UNC బర్న్ సెంటర్‌కు తరలించారు.అక్కడ ఈ బాలుడికి చాలా సర్జరీలు చేశారు.

ఆ ఈవెంట్ లో అవమానం.. నితిన్ సారీ చెప్తాడని వెళ్తే అలా జరిగింది.. హర్షవర్ధన్ కామెంట్స్ వైరల్!
న్యూస్ రౌండప్ టాప్ 20 

కనీసం ఆరు నెలల పాటు ఆసుపత్రిలోనే వైద్య చికిత్స పొందాల్సి ఉంటుందిగా డాక్టర్లు అతనికి సూచించారు.

Advertisement

అతని వైద్య ఖర్చుల కోసం అతని తల్లి గోఫండ్ మీ పేజీని ఏర్పాటు చేసింది.అతని తరపున అతని అమ్మమ్మ కూడా ఒక పేజీని ఏర్పాటు చేసింది.మాసన్ కోలుకోవడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది.

అతను చాలా నొప్పితో మరియు మత్తులో ఉన్నాడు.ఈ క్లిష్ట సమయంలో అతని కుటుంబం ప్రార్థనలు, మద్దతును కోరింది.

ఈ సంఘటన సోషల్ మీడియాలో ప్రమాదకరమైన ఛాలెంజ్‌లను ప్రయత్నించడం వల్ల కలిగే ప్రమాదాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తుందని అనడంలో సందేహం లేదు.

తాజా వార్తలు