ఇదేందయ్యా ఇది: ఆ అక్కాచెల్లెళ్ల శరీర‌మంతా వెంట్రుకలే...!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాలలో కొందరికి విచిత్రమైన రోగాలు సంభవిస్తుంటాయి.అందులో మనకు ఎన్నో తెలియనివి ఉంటాయి.

ఇటువంటి అరుదైన సమస్యలలో ఒక సమస్యను గురించి మనము ఇప్పుడు తెలుసుకుందాము.అది ఏమిటంటే.

Sindrom, Dicease, Sisters, Hair, Body, Three Indian Sisters Suffering From A Rar

మనిషి శరీరం నిండా వెంట్రుకలు వ్యాప్తి చెందడం.అదెలా అంటే సినిమాలో చివర్లో చూపించ విందంగా అనమాట.

అలాగే ఇంకో విశేషము ఏమిటంటే.ఆ వ్యాధి కూడా ఒకే తల్లికి పుట్టిన ముగ్గురు అక్కాచెల్లెళ్లకు సంభవించడం దురదృష్టకరం.

Advertisement

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.శరీరం నిండా వెంట్రుకలు మొలిచే వ్యాధిని వైద్య పరిభాషలో " హైపర్ త్రైకోసిస్ " అని పిలుస్తారు.

దీనిని " వేర్ వోల్ఫ్ సిండ్రోమ్ " అని కూడా పిలుస్తారు.ఒకే కుటుంబానికి చెందిన సవిత, మోనీషా, సావిత్రి అనే ఈ ముగ్గురు అక్కలు చెల్లెళ్లకు ఈ వ్యాధి సంక్రమించింది.

వారికి ఎలా అంటే పురాణ కథలలో ఉండే తోడేలు మ‌నిషికి ఉండేలా శ‌రీరమంతా వెంట్రుక‌లు ఉంటాయి క‌దా.స‌రిగ్గా అలాగే, ఈ ముగ్గురు అక్కా చెల్లెళ్ల‌కు శ‌రీర‌మంత‌టా ద‌ట్టంగా ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా వెంట్రుక‌లు పెరుగుతున్నాయి.

సాధార‌ణంగా మ‌న శ‌రీరంలో ప‌లు చోట్ల వెంట్రుక‌లు మొలిచేలా చేసే క‌ణాలు యాక్టివ్ ‌లో ఉండ‌వు.కానీ ఈ స్థితి ఉన్న‌వారి శ‌రీర‌మంత‌టా స‌ద‌రు క‌ణాలు యాక్టివ్‌గానే ఉంటాయి.

రక్తపు మరకల దుస్తులతోనే తండ్రికి కూతురు అంత్యక్రియలు.. వీడియో చూస్తే కన్నీళ్లాగవు..
ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల.. పైచేయి సాధించిన అమ్మాయిలు..!

అందువ‌ల్ల శ‌రీరం మొత్తం ఎక్క‌డ చూసినా వెంట్రుక‌లే.ఈ పరిస్థితి ఆ అక్కాచెల్లెళ్లకు భరించలేని బాధగా అనిపిస్తుంది.

Advertisement

పదిమందిలోకి వెళ్లాలంటే వెళ్లలేక పోతున్నామని బాధ పడుతున్నారు.అయితే ఇటువంటి వ్యాధి నూరు కోట్ల మందిలో ఒక్కరికి మాత్రమే వస్తుందని వైద్యులు చెబుతున్నారు.

ఇది జన్యుపరమైన లోపం వల్ల ఈ ముగ్గురు అక్క చెల్లెళ్లకు సంభవించింది.కొందరు డాక్టర్లు దీనిని సరి చేయవచ్చునని చెప్తున్నారు.

కొందరు సరిగ్గా చెప్పలేకపోతున్నారు.ముందు దీనిని నయం చేసే చికిత్సను డాక్టర్లు చేస్తారో లేదో వేచి చూడాల్సిందే మరి.

తాజా వార్తలు