ఈ వీసా ఉన్న వాళ్ళు ఎంతటి అదృష్టవంతులంటే...కలలో కూడా ఊహించని ఆఫర్లు క్యూ...

వీసా చరిత్రలో, కనీ వినీ ఎరుగని తీరిలో బహుశా మొట్టమొదటి సారిగా ఓ దేశం తమ వీసా పై భారీ ఆఫర్ ప్రకటించింది.

సదరు వీసా దారుల కళ్ళు చెదిరిపోయేలా, నోళ్ళు వెళ్ళబెట్టి మరీ ఆశ్చర్య పోయేలా ఉంది ఈ ఆఫర్.

ఇంతకీ ఏమిటా ఆఫర్, ఏ దేశం ఇస్తోంది, అనే వివరాలోకి వెళ్తే.అరబ్బు దేశాలలో యూఏఈ కి ప్రత్యేకమైన స్థానం ఉంది.

అక్కడ ఉండే ప్రపంచ దేశాలకు చెందిన ప్రవాసులు పలు రంగాల్లో కీలక పదవులలో ఉంటూ ఆ దేశ అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.ఈ క్రమంలోనే తమ దేశానికి పలు రంగాలలో అత్యుత్తమైన సేవలు అందించిన వారికి ఆ దేశం గోల్డన్ వీసాలను అందించింది.

ఈ వీసాలను ఐదేళ్ళ నుంచీ సుమారు 10 ఏళ్ళ కాల పరిమితితో జారీ చేసింది.ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఈ గోల్డెన్ వీసాలను అందుకున్నారు.

Advertisement

భారత్ లోని బాలివుడ్ నటులు మొదలుకుంది, యూఏఈ లో పలు రంగాలలో నిష్టాతులైన వారికి ఈ గోల్డెన్ వీసా అందించింది.ఈ వీసాలు ప్రతీ ఏడాది వాటంత అవే రెన్యువల్ అవుతాయి కూడా.

ఈ వీసా దారులు 100 శాతం పెట్టుబడుదారులుగా వ్యాపారం చేసుకోవచ్చు కూడా అయితే ఇప్పటికే ఈ వీసా దారులకు ఎన్నో సదుపాయాలు కల్పించిన యూఏఈ ప్రభుత్వం తాజాగా ఈ వీసా దారులకు కళ్ళు చెదిరిపోయేలా భారీ ఆఫర్ ను ప్రకటించింది.గోల్డ్ వీసా దారులకు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించే ఈసాద్ గోల్డ్ వీసా దారులకు ప్రత్యేక ప్రివిలేజ్ వీసాను ఇస్తున్నట్టుగ ప్రకటించింది.

గోల్డెన్ వీసా కలిగిన ఈ సాద్ కార్డు దారులకు మాత్రం భంపర్ ఆఫర్ పొందేందుకు అర్హులుగా ఉంటారు.ఈ ప్రివిలేజ్ కార్డు ద్వారా ప్రపంచ వ్యాప్తంగా సుమారు 92 దేశాలలో 7300 బ్రాండ్స్ కి చెందిన వ్యాపారాలలో భారీ ఆఫర్లు , ప్రత్యేకమైన డిస్కౌంట్ లు ఉంటాయి.

ఈ ప్రివిలేజ్ కార్డ్స్ ను దుబాయ్ పోలీసులు జరీ చేస్తారు.

వైసీపీ కార్యాలయం కూల్చివేత పై జగన్ ఏమన్నారంటే ? 
Advertisement

తాజా వార్తలు