ప్రీతి ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి

సూర్యాపేట జిల్లా:గిరిజన మెడికల్ విద్యార్దిని ప్రీతి ఆత్మహత్యకు కారణమైన మెడికల్ పిజి విద్యార్ది సైఫ్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా కేంద్రంలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం, గిరిజన ఉపాధ్యాయ సంఘం,గ్లోబల్ బంజారా వెల్ ఫేర్ సొసైటీ,గిరిజన డాక్టర్స్ మరియు డిటిఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు.

కొత్త బస్టాండ్ నుంచి తెలంగాణ తల్లి విగ్రహం వరకు కొవ్వొత్తులతో ర్యాలి నిర్వహించి,డాక్టర్ ప్రీతి నాయక్ కు నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ గిరిజన బిడ్డ మెడిసిన్ చదివే స్వేచ్చ లేదా అని ప్రశ్నించారు.కాలేజ్ యాజమాన్యానికి పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యకు తీసుకోలేదన్నారు.

డాక్టర్ ప్రీతి కుటుంబానికి రూ.కోటి నష్టపరిహారం చెల్లించాలని,కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కళాశాలల యందు ర్యాగింగ్ నిరోధక చట్టాన్ని అమలు చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధరావత్ మోతీలాల్,జిల్లా అధ్యక్షులు బాలు నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి ధరావత్ వెంకన్న నాయక్, జిబిఎస్ అధ్యక్షులు భూక్య రవి నాయక్,ఉపాధ్యక్షులు ధరావత్ సోమ్ల నాయక్, వస్రం నాయక్,డాక్టర్ విద్యాసాగర్,డాక్టర్ రమేష్ నాయక్,డాక్టర్ గిరిధర్ నాయక్,మోతిలాల్ నాయక్,రెడ్యా నాయక్, లింగా నాయక్,రామకృష్ణ నాయక్,లచ్చిరాం నాయక్,సీతారాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
ఖ‌ర్జూరాలు తినే ముందు ఇవి తెలుసుకోపోతే..మీ దంతాల‌కే ముప్పు జాగ్ర‌త్త‌!

Latest Suryapet News