పొట్ట‌పై చార‌ల‌ను నెల రోజుల్లో పోగొట్టే సూప‌ర్ ఆయిల్ మీకోసం!

పొట్ట‌పై చార‌లు లేదా స్ట్రెచ్ మార్క్స్.చాలా మంది ఆడ‌వారిని క‌ల‌వ‌ర పెట్టే స‌మ‌స్య ఇది.

దాదాపు అంద‌రికీ ప్రెగ్నెన్సీ వ‌ల్ల పొట్ట‌పై చార‌లు ప‌డుతుంటాయి.త‌క్కువ శాతం మందికే శ‌రీర బ‌రువులో హెచ్చుత‌గ్గులు ఏర్ప‌డ‌టం కార‌ణంగా వ‌స్తాయి.

ఏదేమైనా స్ట్రెచ్ మార్క్స్ చూసేందుకు చాలా అస‌హ్యంగా ఉంటాయి.పైగా చ‌ర్మ సౌంద‌ర్యాన్ని దెబ్బ తీస్తాయి.

అందుకే వీటిని వ‌దిలించుకోవ‌డం కోసం విశ్వ‌ప్ర‌యత్నాలు చేస్తుంటారు.అయితే ఇప్పుడు చెప్ప‌బోయే సూప‌ర్ ఎఫెక్టివ్ ఆయిల్‌ను ట్రై చేస్తే కేవ‌లం నెల రోజుల్లోనే పొట్ట‌పై ఏర్ప‌డిన చార‌ల‌ను నివారించుకోవ‌చ్చు.

Advertisement
This Super Oil Helps To Remove Stretch Marks On The Stomach! Super Oil, Remove S

మ‌రి ఆ ఆయిల్ ఏంటో.ఎలా త‌యారు చేయాలో.

ఆల‌స్యం చేయ‌కుండా తెలుసుకుందాం ప‌దండీ.ముందుగా ఒక బంగాళ‌దుంప‌ను తీసుకుని పీల్ తొల‌గించి నీటిలో శుభ్రంగా క‌డిగి ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.

అలాగే ఒక ఉల్లిపాయ‌, అంగుళం అల్లం ముక్క కూడా తీసుకుని పై పొట్టు తొల‌గించి వాట‌ర్‌తో వాష్ చేసి ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.ఇప్పుడు బ్లెండ‌ర్ తీసుకుని అందులో క‌ట్ చేసి పెట్టుకున్న అల్లం, బంగాళ‌దుంప‌, ఉల్లిపాయ ముక్క‌లు వేసి వాట‌ర్ పోయ‌కుండా మెత్త‌గా పేస్ట్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత స్ట‌వ్ ఆన్ చేసి మంద‌పాటి గిన్నెను పెట్టుకుని అందులో అర లీట‌ర్ ఆలివ్ ఆయిల్ మ‌రియు ఉల్లి-అల్లం-బంగాళదుంప పేస్ట్ వేసుకుని ప‌ది నిమిషాల పాటు ఉడికించి చ‌ల్లార‌బెట్టుకోవాలి.

This Super Oil Helps To Remove Stretch Marks On The Stomach Super Oil, Remove S
ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021

బాగా కూల్ అయిన త‌ర్వాత ప‌ల్చ‌టి వ‌స్త్రం సాయంతో ఆయిల్‌ను స‌ప‌రేట్ చేసుకుని ఏదైనా గ్లాస్ జార్‌లో నింపుకోవాలి.ఇక ఈ ఆయిల్‌ను ఉద‌యం, సాయంత్రం పొట్ట‌కు అప్లై చేసి క‌నీసం ప‌దిహేను నిమిషాల పాటు స్మూత్‌గా మ‌సాజ్ చేసుకోవాలి.ఇలా ప్ర‌తి రోజు చేస్తే గ‌నుక కేవ‌లం నెల రోజుల్లోనే పొట్ట‌పై చార‌లు క్ర‌మంగా మాయం అవుతాయి.

Advertisement

తాజా వార్తలు