హుజురాబాద్ ఉప ఎన్నిక ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమే.కాగా ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున మాజీ మంత్రి ఈటల రాజేందర్ బరిలో ఉన్నారు.
ఇక ఈటలను ఓడించేందుకుగాను అధికార టీఆర్ఎస్ పార్టీ సర్వ శక్తులను ఒడ్డుతోంది.దళిత బంధుపథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా హుజురాబాద్‌లోనే లాంచ్ చేయబోతున్నది.
ఇకపోతే ఈ ఎన్నికల్లో ఈటల వర్సెస్ కేసీఆర్ అనే సీన్ క్రియేట్ చేసేందుకు ఈటల రాజేందర్ ప్రయత్నిస్తున్నారు.అందులో భాగంగానే ప్రచారంలో ఎక్కడా మోడీ బొమ్మ కానీ అమిత్ షా ఫొటో కానీ యూజ్ చేయడం లేదు.
కాగా ఈ విషయమై పింక్ పార్టీ ట్రబుల్ షూటర్, మంత్రి హరీశ్ విమర్శిస్తున్నారు.కాగా, సుదీర్ఘ కాలం ప్రజల్లో ఉన్న తాను మోడీ ఫొటోను ప్రచారంలో వ్యతిరేకత రావడంతో పాటు గులాబీ పార్టీ నేతల విమర్శలకు సమాధానాలు చెప్పాల్సి వస్తుందని, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే బీజేపీ నేతల ఫొటోలు వాడటం లేదని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే మాజీ మంత్రి ఈటల రాజేందర్ హుజురాబాద్ ఉప ఎన్నిక టీఆర్ఎస్ వర్సస్ బీజేపీ అన్నట్లు చెప్పడం లేదని సమాచారం.కొవిడ్ సెకండ్ వేవ్ తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు బాగా పెరగగా, మోడీ ఫొటో పెట్టుకుంటే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే చాన్సెస్ ఉన్నట్లు ఈటల భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ తరఫున ప్రచారం నిర్వహించేందుకుగాను కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా త్వరలో వస్తారని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి.అయితే, బీజేపీ నేతలు ఎవరు వచ్చినా రాకపోయినా అన్నీ తానై ఈటల రాజేందర్ ఒంటరిగానే ప్రచార పథంలో దూసుకుపోతున్నారు.పాదయాత్ర సందర్భంగా మోకాలికి సర్జరీ కాగా కొంత కాలం బ్రేక్ ఇచ్చారు ఈటల.తాజాగా మళ్లీ ప్రజల్లోకి వెళ్తున్నారు రాజేందర్.చూడాలి మరి హుజురాబాద్ రాజకీయం ఇంకెన్ని టర్న్స్ తీసుకుంటుందో.