లైవ్ లో అడ్డంగా దొరికిపోయిన ప్రశాంత్ కిషోర్.. నిజస్వరూపం బయటపడిందిగా!

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రశాంత్ కిషోర్( Prashant Kishor ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

ఈ ఎన్నికల్లో వైసీపీ గెలవడం అసాధ్యమని కూటమికి అనుకూలంగా ప్రశాంత్ కిషోర్ వేర్వేరు సందర్భాల్లో కామెంట్లు చేశారు.

అయితే అతని నిజస్వరూపం ఏంటో తాజాగా లైవ్ లో తెలిసిపోయింది.సీనియర్ జర్నలిస్ట్ కరణ్ థాపర్ కు ప్రశాంత్ కిషోర్ తాజాగా ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది.

కరణ్ థాపర్( Karan Thapar ) ప్రశాంత్ కిషోర్ తో మీ అంచనాలు గతంలో విఫలమయ్యాయని చెబుతూ హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ( Himachal Pradesh, Telangana ) ఫలితాలను ఎగ్జాంపుల్ గా చూపించడం జరిగింది.హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ఓటమిపాలవుతుందని తెలంగాణలో బీ.ఆర్.ఎస్ అధికారంలోకి వస్తుందని గతంలో ప్రశాంత్ కిషోర్ చెప్పిన విషయాలను కరణ్ థాపర్ గుర్తు చేయగా మొదట నేను ఎక్కడ అన్నానో చూపించండి అంటూ బుకాయించారు.

లైవ్ లోనే ప్రశాంత్ కిషోర్ ట్వీట్ ను కరణ్ థాపర్ చూపించడంతో షాకవ్వడం పీకే వంతైంది.ఏం చేయాలో పాలుపోని ప్రశాంత్ కిషోర్ ఉక్రోషంతో ఊగిపోతూ మీరు జర్నలిస్ట్ కాదు అంటూ కరణ్ థాపర్ పై కామెంట్లు చేశారు.ఏపీ విషయంలో సైతం ప్రశాంత్ కిషోర్ అంచనాలు తప్పుతాయని ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

ప్రశాంత్ కిషోర్ టీడీపీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నా ఆ విషయాలను బయటకు చెప్పుకోలేని స్థితిలో ఉండటం గమనార్హం.ఏపీ ఎన్నికల ఫలితాల( AP Election Results ) అనంతరం ప్రశాంత్ కిషోర్ పరువు పోవడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ప్రశాంత్ కిషోర్ కొన్ని పార్టీలకు కొమ్ము కాయడం ద్వారా విశ్వసనీయత కోల్పోతున్నారని సైతం కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.పోలింగ్ పూర్తై చాలా రోజులు అవుతుండగా వైసీపీ గెలుపు విషయంలో పూర్తిస్థాయిలో ధీమాలో ఉంది.

తాము అమలు చేసిన పథకాలే తమను గెలిపిస్తాయని జగన్ నమ్ముతున్నారు.

త్రిష, నయనతారలను రష్మిక వెనక్కు నెట్టేసిందా.. ఆమె రెమ్యునరేషన్ ఎంతంటే?
Advertisement

తాజా వార్తలు