బోయపాటి శ్రీను బలం అదే.. ఆ రీజన్ వల్లే సినిమాలు సక్సెస్ సాధిస్తున్నాయా?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలలో ఎక్కువ సినిమాలు సక్సెస్ సాధించాయనే సంగతి తెలిసిందే.

ఒక్కో సినిమాకు బోయపాటి శ్రీను 25 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

గతేడాది అఖండ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ సాధించిన బోయపాటి శ్రీను ప్రస్తుతం రామ్ హీరోగా ఒక సినిమాను తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నారు.డ్యూయల్ రోల్స్ బోయపాటి శ్రీను బలం అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

చాలామంది డైరెక్టర్లు డ్యూయల్ రోల్స్ తో తెరకెక్కించిన సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించడం లేదు.డ్యూయల్ రోల్స్ కథలను హ్యాండిల్ చేయడం సులువైన విషయం కాదనే సంగతి తెలిసిందే.

స్టార్ హీరోలతో డ్యూయల్ రోల్స్ తీసి ప్రేక్షకులను మెప్పించాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది.బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సింహా, లెజెండ్, అఖండ సినిమాలు తెరకెక్కగా ఈ మూడు సినిమాలలో బాలయ్య డ్యూయల్ రోల్స్ లో నటించి మెప్పించారు.

This Is The Plus Point For Boyapati Srinu Details, Boyapati Srinu, Dula Roles, R
Advertisement
This Is The Plus Point For Boyapati Srinu Details, Boyapati Srinu, Dula Roles, R

ఫస్టాఫ్ లో ఒక పాత్రతో సెకండాఫ్ లో మరో పాత్రతో నట విశ్వరూపం చూపించి బాలయ్య విజయాలను అందుకుంటున్నారు.బోయపాటి శ్రీను రామ్ డ్యూయల్ రోల్ లో ఒక సినిమాను తెరకెక్కిస్తుండగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

This Is The Plus Point For Boyapati Srinu Details, Boyapati Srinu, Dula Roles, R

రామ్ కు కూడా బోయపాటి శ్రీను కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ఇవ్వడం ఖాయమని బోయపాటి శ్రీను అభిమానులు భావిస్తున్నారు.బోయపాటి శ్రీను సినిమాలన్నీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా బోయపాటి శ్రీను భవిష్యత్తు ప్రాజెక్ట్ లు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.సినిమాసినిమాకు బోయపాటి శ్రీను మార్కెట్ అంతకంతకూ పెరుగుతోంది.

బోయపాటి శ్రీను తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సక్సెస్ లను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

నాన్న చనిపోయినప్పుడు ఏడుపు రాలేదన్న థమన్.. ఆయన చెప్పిన విషయాలివే!
Advertisement

తాజా వార్తలు