ఎదిగే పిల్ల‌ల‌కు త‌ప్ప‌కుండా ఇవ్వాల్సిన ఫుడ్ ఇదే!

పిల్ల‌లకు పెట్టే ఆహారం విష‌యంలో త‌ల్లి దండ్రులు చాలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సి ఉంటుంది.అలాగే వ‌య‌సు బ‌ట్టీ వారి ఆహారంలో మార్పులు చేస్తూ ఉండాలి.

ఎందుకంటే, పిల్ల‌ల ఎదుగుద‌ల‌పై ప్ర‌ధానంగా ప్ర‌భావం చూపేది ఆహార‌మే.అలాగే పిల్ల‌లు ప్ర‌తి విష‌యంలో చురుగ్గా ఉండేందుకు స‌హాయ‌ప‌డేది ఆహార‌మే.

అయితే ఎదిగే పిల్ల‌ల‌కు త‌ప్ప‌కుండా కొన్ని ఆహారాలు పెట్టాల్సి ఉంటుంది.మ‌రి అవేంటో ఆల‌స్యం చేయ‌కుండా ఓ లుక్కేసేయండి.

ఎదిగే పిల్ల‌ల‌కు ప్ర‌తి రోజు ఒక గ్లాస్ పాలు మ‌రియు ఉడికించిన గుడ్డు త‌ప్ప‌కుండా పెట్టారు.పాలు మ‌రియు గుడ్డులో ఉండే ప్రోటీన్లు, విట‌మిన్లు మ‌రియు ఇత‌ర‌ పోష‌కాలు పిల్ల‌ల‌కు అందుతాయి.

Advertisement

ఇటీవ‌ల కాలంలో చిన్న చిన్న‌ పిల్ల‌ల్లోనే కంటి చూపు మంద‌గిస్తుంది.అందుకే వారికి క్యారెట్‌, ఆకు కూర‌లు, చేప‌లు పెగితే.

అందులో ఉండే విట‌మిన్ కంటి చూపును మెరుగు ప‌ర‌చ‌డంతో పాటు శారీరక ఎదుగుదల‌కి ఉప‌యోగ‌ప‌డుతుంది.

అలాగే ఎదిగే పిల్ల‌ల‌కు ప్ర‌తి రోజు నాన బెట్టిన ఐదు బాదంలు ఇవ్వాలి.బాదంలో ఉండే విటమిన్ ఇ, విటమిన్ బి6, ప్రొటీన్, ఫైబ‌ర్‌, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌, క్యాల్షియం, పొటాషియం ఇలా ఎన్నో పోష‌కాలు ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంతో పాటు పిల్ల‌ల్లో ఆలోచ‌న శ‌క్తి పెరుగుతుంది.బాదంతో పాటు వాల్‌నట్స్‌, వేరుసెనగలు వంటివి కూడా ఇవ్వాలి.

సిట్రస్ ఫ్రూట్స్ అంటే క‌మ‌లా పండు, బొప్పాయి, బ‌త్తాయి వంటి పండ్ల‌ను ఎదిగే పిల్ల‌ల‌కు పెట్ట‌డం వ‌ల్ల‌.అందులో ఉండే విట‌మిన్ సి రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే జ‌బ్బుల‌కు దూరంగా ఉంచుతుంది.

ప్రభాస్ తో సినిమా చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్న బాలీవుడ్ డైరెక్టర్...
క‌డుపులో మంట క్ష‌ణాల్లో త‌గ్గాలా..అయితే ఇలా చేయండి!

ఇక ఎదిగే పిల్ల‌ల్లో ర‌క్త‌హీన‌త స‌మ‌స్య ఎక్కువ‌గా ఉంటుంది.కాబ‌ట్టి, ఐర‌న్ పుష్క‌లంగా ఉండే పాల‌కూర‌, బీట్‌రూట్‌, దానిమ్మ‌, కివీ పండు, డేట్స్, ఎండుద్రాక్ష‌ వంటివి పెట్టాల్సి ఉంటుంది.

Advertisement

ఎదిగే పిల్ల‌ల్లో ఎముక‌లు బ‌లంగా త‌యార‌వ్వాలంటే.కాల్షియం పుష్క‌లంగా ఉండే అంజీరపండ్లు, చీజ్‌, ప్రౌన్స్, నువ్వులు, ఓట్స్ వంటివి పిల్ల‌ల‌కు పెట్టాలి.

తాజా వార్తలు