వరల్డ్ కప్ పోరుకి తుది టీమిండియా జుట్టు ఇదే..!

ఐపీఎల్ 2021 సీజన్ ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 15న జరగనుంది.ఈ ఫైనల్ మ్యాచ్ ముగిసిన కొద్ది గంటల్లోనే టీ-20 ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆరంభమవుతాయి.

అయితే ఆ మ్యాచ్‌లు కూడా ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగిన పిచ్‌లపైనే ప్రారంభం కావడం విశేషం.మరో విశేషం ఏంటంటే.టీ20 వరల్డ్ కప్ కి సెలెక్ట్ అయిన క్రికెటర్లందరూ నెలరోజులుగా ఐపీఎల్‌లో ఆడుతున్నారు.దీంతో వారంతా కూడా మంచి ఫామ్ లో ఉన్నారు.

ప్రపంచకప్‌లో ఈ అనుభవం భారత జట్టుకు బాగా ఉపయోగపడుతుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో టీమిండియా టీ20 వరల్డ్ కప్ జట్టులో భారత క్రికెట్ నియంత్రణ మండలి మార్పులు చేర్పులు చేసింది.అక్షర్ పటేల్‌ను పక్కన పెట్టేసి ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్‌కు జట్టులో స్థానం కల్పించింది.

Advertisement

ఆల్ రౌండర్ ఆటగాళ్లు ఉంటేనే టీ20 మ్యాచ్‌ల్లో విజయం సాధించగలమని బీసీసీఐ భావిస్తోంది.అందుకే మంచి ఆల్ రౌండర్ ఆటగాడైన శార్దుల్ ఠాకూర్‌ను తీసుకుంది.

బీసీసీఐ ఎంపిక చేసిన 15 మంది జట్టులో మొన్నటిదాకా శార్దూల్ లేరు.అతను స్టాండ్‌బై ప్లేయర్‌గా జట్టులో ఉన్నారు.అయితే తాజాగా బీసీసీఐ అతడిని తుది జట్టులో చేర్చుకుంది.15 మందితో కూడిన టీమిండియా తుది జట్టులో శార్దూల్ ఠాకూర్‌ను చేర్చిన బీసీసీఐ .అక్షర్ పటేల్‌ను స్టాండ్‌బై ప్లేయర్‌గా జట్టులో నియమించింది.

2021 టీ20 వరల్డ్ కప్ అక్టోబర్ 17 నుంచి స్టార్ట్ కానున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్‌లో ఆడనున్న భారత ప్లేయర్ల పేర్లు తెలుసుకుంటే.విరాట్‌ కోహ్లి (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ (వైస్‌-కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషభ్‌ పంత్‌ (వికెట్ కీపర్‌), ఇషాన్‌ కిషన్‌, హర్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, రాహుల్‌ చాహర్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, శార్దూల్ ఠాకూర్‌, వరుణ్‌ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్, మహమ్మద్‌ షమి.

ఇక శ్రేయస్‌ అయ్యర్, దీపక్‌ చాహర్‌, అక్షర్ పటేల్‌ స్టాండ్‌-బై ప్లేయర్లగా ఉన్నారు.ఐపీఎల్ 2021లో శార్దూల్ అద్భుతమైన ఆట ప్రదర్శన కనబరిచారు.చెన్నై సూపర్ కింగ్స్‌ ఫైనల్స్‌కు వెళ్లిందంటే అందుకు కారణం శార్దూల్ యే అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.

ప్రభాస్ తో సినిమా చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్న బాలీవుడ్ డైరెక్టర్...
తొలి ప్రయత్నంలో ఫెయిల్.. రెండో ప్రయత్నంలో ఐఎఫ్ఎస్ ఫస్ట్ ర్యాంక్.. రిత్విక సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

శార్దూల్ ఇప్పటివరకు ఐపీఎల్ 2021 సీజన్లో 15 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు పడగొట్టారు.

Advertisement

తాజా వార్తలు