చంద్ర‌బాబు ముంద‌స్తు ప్లాన్ క‌థ ఇదే...!

కీల‌కమైన రాజ‌కీయ పార్టీలు ఎన్నిక‌ల స‌మ‌యంలో అనుస‌రించే వ్యూహాలు చాలా గ‌మ్మ‌త్తుగా ఉంటాయి.టికెట్ల విష‌యంలో ఆచితూచి అడుగులు వేస్తాయి.

ఒక‌రికి టికెట్ ఇస్తే.మ‌రొక‌రు అలుగుతార‌ని.

రెబ‌ల్ కూడా మారే అవ‌కాశం ఉంటుంద‌ని భావిస్తుంటాయి.అదేస‌మ‌యంలో అస‌మ్మ‌తి పెల్లుబుకుతుంద‌ని కూడా బాధ‌ప‌డుతుంటాయి.

అందుకే టికెట్ల పంపిణీని దాదాపు నామినేష‌న్ల గ‌డువు ముగిసే.రెండు మూడు రోజుల ముందు మాత్ర‌మే ఇచ్చే సంప్ర‌దాయాన్ని అన్ని ప్ర‌ధాన పార్టీలూ అనుస‌రిస్తు న్నాయి.

Advertisement
This Is The Chandrababu New Plan..!,ap,ap Politics,ap Political News,latest News

గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో టీడీపీ కూడా ఇదే వైఖ‌రిని అవలంభించింది.అయిన‌ప్ప‌టికీ.

చాలా చోట్ల నేత‌లు అస‌మ్మ‌తి జెండా ఎగ‌రేశారు.ఇదిలావుంటే.

ఇప్పుడు తిరుపతి పార్ల‌మెంటు స్థానం ఉప ఎన్నిక‌కు మ‌రో మూడు మాసాల గ‌డువు ఉంది.కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఇంకా దీనిపై దృష్టి కూడా పెట్ట‌లేదు.

నోటిఫికేష‌న్ కానీ, ప్ర‌క‌ట‌న కానీ.ఇప్ప‌ట్లో లేనే లేవు.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి30, ఆదివారం 2025

అయినాకూడా టీడీపీ అధినేత చంద్ర‌బాబు మాత్రం ముందే కూసిన కోయిల మాదిరిగా .ఇక్క‌డ అభ్య‌ర్థిని ప్ర‌క‌టించేశారు. కేంద్ర మాజీ మంత్రి, గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచే టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసి ప‌రాజ‌యం పాలైన ప‌న‌బాక ల‌క్ష్మికి చంద్ర‌బాబు టికెట్ ఇచ్చారు.

Advertisement

ఇలా ముంద‌స్తుగానే అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌డం వెనుక ఏమైనా వ్యూహం ఉందా? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.దీనికి టీడీపీ నాయ‌కులు రెండు వాద‌న‌లు వినిపిస్తున్నారు.

అసంతృప్తులను బుజ్జగించడానికి, నిధుల సమీకరణకు, నాయకులు, కార్యకర్తలతో పలుమార్లు సమావేశం కావడానికి, సాధ్యమైనంత మంది ఓటర్లను నేరుగా కలవడానికి చాలా ఉపకరిస్తుందన్నది ఓ వ‌ర్గం మాట‌.

అదే స‌మ‌యంలో ఇంకొంద‌రు ఏమంటున్నారంటే.సింప‌తీ ఓటు బ్యాంకుకు అవ‌కాశం ఉన్న ఎన్నిక‌లు కావ‌డంతో ఇప్ప‌టి నుంచే ప‌న‌బాక ఆ ఓట్ల‌ను టీడీపీ వైపు మ‌ళ్లించేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని.పైగా అస‌మ్మ‌తిని త‌న దారిలో తెచ్చుకునే ఛాన్స్‌కూడా ఉంటుంద‌ని చెబుతున్నారు.

ఈ వ్యూహంతోనే చంద్ర‌బాబు ముంద‌స్తుగా ప్ర‌క‌టించార‌ని చెబుతున్నారు.మ‌రి ఈ వ్యూహం ఏమేర‌కు ఫ‌లిస్తుందో చూడాలి.

తాజా వార్తలు