పురుషుల్లో జుట్టు రాలడాన్ని అడ్డుకునే ఉత్తమ చిట్కా ఇది.. డోంట్ మిస్..!

అధిక ఒత్తిడి, కంప్యూటర్ల ముందు గంటల తరబడి కూర్చుని పనిచేయడం, పోషకాల కొరత, ధూమపానం వంటి కారణాల వల్ల చాలా మంది పురుషుల్లో హెయిర్ ఫాల్( Hair fall ) అనేది అధికంగా ఉంటుంది.

ఆడవారి మాదిరిగా పురుషులు కూడా జుట్టు రాలడం విషయంలో ఎంతగానో వర్రీ అవుతుంటారు.

జుట్టు రాలే సమస్యను అడ్డుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే ఇంటి చిట్కా మీకు ఉత్తమంగా సహాయపడుతుంది.వారానికి కేవలం ఒక్కసారి ఈ చిట్కాను పాటిస్తే జుట్టు రాలే సమస్యకు సులభంగా చెక్ పెట్టవచ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ చిట్కా ఏంటో ఓ చూపు చూసేయండి.ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు వైట్ రైస్ ( White rice )ను వేసుకోవాలి.

అలాగే రెండు నుంచి మూడు మందారం పువ్వులు( Hibiscus flowers ) మరియు ఒక కప్పు పాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

Advertisement

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు మొత్తానికి పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూ( Mild shampoo ) ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒకసారి ఈ విధంగా చేయడం వల్ల చాలా లాభాలే ఉన్నాయి.

అన్నం, మందారం, పాలు మరియు విటమిన్ ఈ ఆయిల్ జుట్టు రాలడాన్ని అడ్డుకోవడంలో సమర్థవంతంగా సహాయపడతాయి.ఎంతో వేగంగా హెయిర్ ఫాల్ సమస్యను దూరం చేస్తాయి.

అదే సమయంలో జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.పల్చటి జుట్టును ఒత్తుగా మారుస్తాయి.బట్టతల వచ్చే రిస్క్ ను తగ్గిస్తాయి.

జుట్టుకు చక్కని పోషణ అందిస్తాయి.హెయిర్ రూట్స్ ను స్ట్రాంగ్ గా మారుస్తాయి.

చిగుళ్ల నుంచి తరచూ రక్తం వస్తుందా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!
ఆ విషయంలో ఎన్టీఆర్ అసలు మనిషే కాదు... సంచలనంగా మారిన అజయ్ కామెంట్?

కాబట్టి జుట్టు రాలే సమస్య తో బాధపడుతున్న పురుషులు తప్పకుండా ఈ హోమ్ రెమెడీని ప్రయత్నించండి.

Advertisement

తాజా వార్తలు