Carrot Amla Salad : వింటర్ లో ఖ‌చ్చితంగా తీసుకోవాల్సిన సలాడ్ ఇది.. ఎందుకంటే?

వింటర్ సీజన్ రానే వచ్చింది.చలి పులి మెల్లమెల్లగా బలపడుతుంది.

సాధార‌ణంగా చలికాలంలో దగ్గు జలుబు ఆస్తమా తదితర సీజనల్ సమస్యలు తీవ్రంగా ఇబ్బంది పెడుతుంటాయి.

వీటి నుంచి తప్పించుకుని ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలంటే ఖ‌చ్చితంగా డైట్ లో కొన్ని కొన్ని ఆహారాలు చేర్చుకోవాల్సి ఉంటుంది.

అటువంటి ఆహారాల్లో ఇప్పుడు చెప్పబోయే సలాడ్ కూడా ఒకటి.ఈ సలాడ్ ను వారంలో కనీసం నాలుగు సార్లు కనుక తీసుకుంటే బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలను తమ సొంతం చేసుకోవచ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ స‌లాడ్ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? మరియు దాన్ని తీసుకోవడం వల్ల వచ్చే ఆరోగ్య లాభాలు ఏంటి.? వంటి విషయాలను ఓ చూపు చూసేయండి.ముందు రెండు చిన్న సైజు క్యారెట్లను తీసుకుని పీల్ తొలగించి వాటర్ లో శుభ్రంగా కడిగి సన్నగా తురుముకోవాలి.

Advertisement
This Is A Must Have Salad In Winter , Carrot Amla Salad, Salad, Latest News, He

అలాగే రెండు ఉసిరి కాయల‌ను తీసుకుని నీటిలో కడిగి తురుముకోవాలి.అలాగే ఒక చిన్న సైజు ఉల్లిపాయలు తీసుకుని తొక్క తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో క్యారెట్ తురుము, ఉసిరికాయ తురుము, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, వన్ టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు, ఒక కప్పు ఫ్రెష్ పెరుగు, పావు టేబుల్ స్పూన్ పింక్ సాల్ట్‌, చిటికెడు మిరియాల పొడి, కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.

This Is A Must Have Salad In Winter , Carrot Amla Salad, Salad, Latest News, He

చివరిగా వన్ టేబుల్ స్పూన్ తేనెను వేసి మరోసారి కలిపితే క్యారెట్ ఉసిరి సలాడ్ సిద్ధం అవుతుంది.ఈ సలాడ్ రుచిగా ఉండటమే కాదు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ప్రస్తుత వింటర్ సీజన్ లో తరచూ ఈ సలాడ్ ను తీసుకోవడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.

దాంతో సీజన‌ల్‌ వ్యాధులు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.అలాగే ఈ సలాడ్ ను డైట్ లో చేర్చుకోవడం వల్ల వెయిట్ లాస్ అవుతారు.రక్తహీనత సమస్య ఏమైనా ఉంటే దూరం అవుతుంది.

This Is A Must Have Salad In Winter , Carrot Amla Salad, Salad, Latest News, He

ఎముకలు దృఢంగా మారతాయి.కంటి చూపు మెరుగుపడుతుంది.జుట్టు రాలడం కంట్రోల్ అవుతుంది.

ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!

మొటిమలు తరచూ ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి.చర్మం నిగారింపు గా మెరుస్తుంది.

Advertisement

మరియు రక్తంలో చక్కెర స్థాయిలు సైతం అదుపులో ఉంటాయి.కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ క్యారెక్టర్ ఉసిరి సలాడ్ ను డైట్ లో చేర్చుకునేందుకు ప్రయత్నించండి.

తాజా వార్తలు