జిడ్డును తొలగించి ముఖాన్ని క్షణాల్లో ఫ్రెష్ గా గ్లోయింగ్ గా మార్చే ఇన్‌స్టంట్ ఫేస్ వాష్ మీకోసం!

సాధారణంగా కొందరి స్కిన్ ఆయిలీ ఆయిలీ గా ఉంటుంది.

ఇలాంటి వారు మార్కెట్లో లభ్యమయ్యే ఖరీదైన ఆయిలీ ఫ్రీ ఫేస్ వాష్ లను కొనుగోలు చేసి వాడుతుంటారు.

అయితే ఎంత ఖరీదైన ఫేస్ వాష్ ను వాడినప్పటికీ కొద్ది నిమిషాలకే మళ్లీ చర్మం జిడ్డు జిడ్డుగా మారుతుంటుంది.కానీ ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ ఫేస్ వాష్ ను కనుక వాడితే అధిక జిడ్డు తొలగిపోయి ముఖం క్షణాల్లో ఫ్రెష్ గా మరియు గ్లోయింగ్ గా మారుతుంది.

మరి ఇంతకీ ఆ హోమ్ మేడ్‌ ఫేస్ వాష్ ను ఎలా తయారు చేసుకోవాలి అనేది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్ ను తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ కాఫీ పొడి, వన్ టేబుల్ స్పూన్ గోధుమపిండి వేసుకోవాలి.

అలాగే రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్, నాలుగు టేబుల్ స్పూన్లు రోజ్ వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేయాలి.అంతే మన న్యాచురల్ ఫేస్ వాష్ సిద్ధం.

Advertisement

ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని వేళ్ళతో సున్నితంగా రబ్ చేసుకోవాలి.

రెండు నుంచి మూడు నిమిషాల పాటు చర్మాన్ని రబ్ చేసుకుని ఆపై వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఈ న్యాచురల్ ఫేస్ వాష్‌ను వాడటం వల్ల చర్మంపై పేరుకుపోయిన అధిక జిడ్డు తొలగిపోతుంది.ముఖ చర్మం క్షణాల్లో తాజాగా, కాంతివంతంగా మారుతుంది.

అలాగే చర్మం ఎక్కువ సమయం పాటు ఆయిలీగా మారకుండా ఉంటుంది.

అంతేకాదు ఈ హోమ్ మేడ్ ఫేస్ వాష్ ను వాడటం వల్ల చర్మం పై పేరుకుపోయిన మురికి మృత కణాలు తొలగిపోతాయి.ట్యాన్ సమస్య దూరం అవుతుంది.అధిక జిడ్డు సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా పైన చెప్పిన న్యాచురల్ ఫేస్ వాష్ ను వాడడానికి ప్రయత్నించండి.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న తప్పు ఇదేనా.. అలా చేయడం వల్లే తక్కువ కలెక్షన్లు!
గుండెను తడిమిన పునీత్ పెయింటింగ్.. గీసింది ఎవరంటే...

చర్మాన్ని ఫ్రెష్ గా మరియు గ్లోయింగ్ గా మెరిపించుకోండి.

Advertisement

తాజా వార్తలు