ఇక అదేనేమో పవన్ చివరి సినిమా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు చేయడం మానేస్తారని మనందరికీ తెలుసు.కాని ఎప్పుడు అనేది ఇంకా క్లారిటి లేదు.

సర్దార్ గబ్బర్ సింగ్ చివరి సినిమా అన్నారు.ఆ తరువాత కాటమరాయుడు వచ్చింది.

కాటమరాయుడు చివరి సినిమా అని ఇలా ప్రచారం జరిగిందో లేదో త్రివిక్రమ్ సినిమా మొదలైంది‌.మరి ఈ సినిమానే చివరి సినిమానా ? కాదేమో ? ఎందుకంటే ఆర్.టీ‌.నీసన్ దర్శకత్వంలో ఓ సినిమా మొదలుపెట్టారు పవన్ కళ్యాణ్.అలాగే సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయాల్సి ఉంటుంది.

ఆ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించాలి.కాని ఈ రెండు సినిమాలు సెట్ మీదకి రావడం అనుమానమే అని టాక్.

Advertisement

పవన్ కూడా మీడియాతో మాట్లాడుతూ అక్టోబర్ నుంచి రాజకీయాలలో యాక్టీవ్ గా ఉంటానని చెప్పారు‌.ఎలక్షన్లకి ఎక్కువ టైమ్ లేదు‌.

పార్టీకి దిగువస్థాయిలో కెడర్ పెరగాలి.మూలల నుంచి బలం పెరగాలి.

అప్పుడే చంద్రబాబు, వైఎస్ జగన్ లాంటి పెద్దవారికి పోటి ఇవ్వగలిగేది.పవన్ ఒప్పుకున్న రెండు సినిమాలు మొదలుపెడితే, పవన్ స్పీడుకి అవి ఎప్పుడు పూర్తవ్వాలి ? అందుకే త్రివిక్రమ్ సినిమాతోనే సినిమా కెరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టాలని పవన్ భావిస్తున్నారట.త్రివిక్రమ్ సినిమా అంటే ఓ స్పెషాలిటీ ఉంటుంది.

తనకి అత్యంత సన్నిహితుడు త్రివిక్రమ్.పైగా అది 25వ సినిమా.

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?
ఏపీ సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్..!!

అభిమానులు నిరుత్సాహపడకూడదనే కామియోలు కలిపి ఈ సినిమాని 25గా మార్చారు.ఓ మైలుతాయితో, అలాగే ఓ బ్లాక్ బస్టర్ తో కెరీర్ ముగించాలనేది పవన్ కోరిక.

Advertisement

మరి ఎంత పెద్ద సక్సెస్ తో తనని స్టార్ చేసిన ప్రపంచాన్ని వదిలేస్తాడో పవర్ స్టార్.

తాజా వార్తలు