గజ దొంగ అరెస్ట్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని ఇల్లందు పోలీస్ స్టేషన్ పరిధిలో 2015 సంవత్సరము నుండి దొంగతనాలకు పాల్పడుతున్న గుగులోతు రంజిత్ ను విశ్వసనీయ సమాచారంతో ఇల్లందు గవర్నమెంట్ ఏరియా ఆసుపత్రి వద్ద సిఐ బి.

రాజు మరియు అతని సిబ్బంది నిఘా పెట్టి పట్టుకోవడం జరిగింది.

ఇతను 2015 సంవత్సరంలో ఇల్లందు పట్టణంలో మూడు దొంగతనాలు, 2017 సంవత్సరంలో ఒక దొంగతనము, 2020 సంవత్సరంలో మూడు దొంగతనాలు, 2021వ సంవత్సరంలో మూడు దొంగతనాలు,2022 సంవత్సరంలో ఒక హత్య ఒకటి మరియు నాలుగు దొంగతనాలు మొత్తం 15 నేరాలలో నిందితుడుగా ఉన్నాడు.ఇట్టి నేరాలలో 06 గ్రేవ్, 09 నాన్ గ్రేవ్ నేరాలున్నాయి.

ఇతను వరుసగా దొంగతనాలు చేస్తూ రాత్రి పూట ఇండ్ల తలుపులకు డ్రిల్లింగ్ చేసి లోపలికి ప్రవేశించి కొట్టి చంపుతానని రోకలి బండతో బెదిరిస్తూ, మహిళల మెడలో ఉన్న ఆభరణాలను మరియు ఇంట్లో వారి వద్ద ఉన్న బంగారం, వెండి మరియు డబ్బులు దోచుకుంటున్నాడు.అదేవిధంగా దేవాలయాలలో తాళాలు పగులగొట్టి దేవతల విగ్రహాలు, హుండీలోని డబ్బులను దొంగలిస్తున్నాడు.

అదే క్రమంలో 201 నవంబరు నెలలో సత్యనారాయణపురం కోడిపందేల వద్ద నిందితుడు గుగులోతు రంజిత్ నకు మరియు మరీదు సోమయ్య అనే వ్యక్తికి కోడిపందెం విషయంలో జరిగిన గొడవ మనసులో పెట్టుకుని ఫిబ్రవరి నెల 2022 సంవత్సరంలో సోమయ్య ఇంటి వెనుక తలుపులకు డ్రిల్లింగ్ ద్వారా రంధ్రం చేసి లోనికి ప్రవేశించి తన వెంట తెచ్చుకున్న రోకలి బండతో మరీదు సోమయ్య తలపై కొట్టి తీవ్రంగా ప చంపినాడు.అడ్డువచ్చిన అతని కూడా బండ కొట్టి గాయపరిచినాడు.

Advertisement

తరువాత కాకతీయ నగర్లో ఒక ఇంటికి దొంగతనానికి వెళ్లి భార్యాభర్తలను కలిబండతో కొట్టి గాయపరిచినాడు, తరువాత కూరగాయల మార్కెట్ వద్ద గల శివాలయంలో వాచ్ మెన్ ను రోకలిబండతో తలపై కొట్టగా, తలపగిలి చికిత్స పొందుతున్నాడు.ఇతను దేవాలయాలు,నివాస గృహములు అని తేడా లేకుండా మానవత్వం మరిచి ప్రవర్తిస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నాడు.

పట్టుబడిన ఇతని వద్ద నుండి 310 గ్రాముల బంగారు ఆభరణాలను, 70 గ్రాముల వెండి వస్తువులను, 95 వేల రూపాయలు నగదు మరియు ఇత్తడి వస్తువులు మరియు హనుమాన్ దేవాలయంలో దొంగతనం చేసిన సువర్చల దేవి అమ్మవారి పంచలోహ విగ్రహమును స్వాధీనపరుచుకోవడం జరిగింది.వీటి మొత్తం విలువ సుమారుగా 20 లక్షల రూపాయలు.

ఉంటుంది.నిందితుడిని ఈ రోజు రిమాండ్ నిమిత్తం కోర్టు నకు తరలించడం జరుగుతుంది.

Latest Khammam News