ఎప్పుడెప్పుడు కొత్త సినిమాలు విడుదలవుతాయా అని ఎదురుచూసే సినీ ప్రియులకు ఈ ఈవారం సందడి చేయడానికి మరిన్ని సినిమాలు రానున్నాయి.గత రెండు వారాలు విడుదలైన సినిమాలు మంచి టాక్ సొంతం చేసుకుని ప్రేక్షకులను బాగా అలరించాయి.
ఇక ఈవారం కూడా ఓటీటీ, థియేటర్లో విడుదలవుతున్న సినిమాలు ఏంటో ఒకసారి చూద్దాం.
ఇట్లు మారేడుపల్లి ప్రజానీకం అనే సినిమా ఈనెల 25న థియేటర్లో విడుదల కానుంది.
ఈ సినిమాకు ఏఆర్ మోహన్ దర్శకత్వం వహించాడు.ఇక ఈ సినిమా ప్రజల కోసం పోరాడి నాయకుడి కథతో రానుంది.
అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన సినిమా భేడియా.ఇక ఈ సినిమా తెలుగులో తోడేలు పేరుతో 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
సొంత దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథన్ నటించిన సినిమా లవ్ టుడే.ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ కాగా తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం చేనున్నారు.ఈ సినిమాను కూడా ఈ నెల 25న థియేటర్లో విడుదల చేయనున్నారు.పరశురాం శ్రీనివాస్ దర్శకత్వం వహించిన సినిమా రణస్థలి.
ఈ సినిమాలో ధర్మ, చాందిని రావు జంటగా నటించిన ఈ సినిమా 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక ఓటీటీ లో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు ఏంటో తెలుసుకుందాం.
నెట్ ఫ్లెక్స్ లో వెన్స్ డే అనే వెబ్ సిరీస్, ద స్విమ్మర్స్ అనే హాలీవుడ్ సిరీస్, గ్లాస్ ఆనియన్ అనే హాలీవుడ్ సిరీస్, బ్లడ్, సెక్స్ అండ్ రాయల్టీ అనే డాక్యుమెంటరీ సిరీస్ నవంబర్ 23న స్ట్రీమింగ్ కానుంది.ద నోయల్ డైరీ అనే హాలీవుడ్ సిరీస్, ఖాకీ: ద బీహార్ చాప్టర్ అనే హిందీ సిరీస్, పడవేట్టు అని మలయాళం సిరీస్ నవంబర్ 25న స్ట్రీమింగ్ కానుంది.

అమెజాన్ ప్రైమ్ లో గుడ్ నైట్ ఊపీ అనే సినిమా నవంబర్ 23న విడుదల కానుంది. జీ ఫైవ్ లో చుప్ అనే బాలీవుడ్ సిరీస్ నవంబర్ 25న స్ట్రీమింగ్ కానుంది.డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రిన్స్ అనే తెలుగు మూవీ నవంబర్ 25న రానుంది.ద గార్డియన్ ఆఫ్ ది గెలాక్సీ హాలిడే స్పెషల్ అనే హాలీవుడ్ సిరీస్ నవంబర్ 25న స్ట్రీమింగ్ కానుంది.

ఆహా లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ తెలుగు మూవీ నవంబర్ 25న విడుదల కానుంది.ఎన్.బి.కె అన్ స్టాపబుల్ సీజన్ 2 ఎపిసోడ్ 4 నవంబర్ 25న స్ట్రీమింగ్ కానుంది.సోనీ లివ్ లో గర్ల్స్ హాస్టల్ అనే హిందీ సిరీస్, మీట్ క్యూట్ అనే తెలుగు మూవీ నవంబర్ 25న స్ట్రీమింగ్ కానుంది.మొత్తానికి ఈ వారం ప్రేక్షకుల ముందుకు మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలు సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి.







