జీవితంలో అవి అన్నీ ఒక భాగమే..వాలెంటైన్స్ డే స్పెషల్ అదే : శృతిహాసన్

శృతిహాసన్, కమల హాసన్ కూతురని అందరికీ తెలిసిన విషయమే .శృతిహాసన్ ఎప్పుడూ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.

తెలుగు, కన్నడ, తమిళం వంటి భాషల్లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది.శృతిహాసన్ హీరోయిన్ గానే కాకుండా, సింగర్ గా కూడా తన ప్రతిభను చాటుకుంది.

అయితే ఈ వాలెంటైన్స్ డేకు తన అభిమానులతో ముచ్చట్లు పెట్టగా చాలా మంది అభిమానులు శృతిహాసన్ క్షేమసమాచారాలు తెలుసుకున్నారు.మరికొంతమంది స్కిన్ గురించి,హెయిర్ గురించి టిప్స్ ఇవ్వమని అడిగారు.

మరికొంతమంది అయితే మీ పెళ్లి ఎప్పుడు అంటు? ఇలా మామూలు ప్రశ్నలు ఎక్కువగా అడిగారు.కానీ ఒక నెటిజన్ మాత్రం మీ సినిమాలు ఫెయిల్ అయినప్పుడు మీరు ఏం చేస్తారు? అంటూ ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు శృతిహాసన్ సినిమాలు ఫెయిల్ అవ్వడం, హిట్ అవ్వడం అన్నవి మన మన చేతుల్లో లేదని.

Advertisement
They Are All Part Of Life Valentines Day Special Is The Same Shruthi Haasan Deta

ఫెయిల్ అయినప్పుడు మాత్రం కచ్చితంగా బాధపడతనాని, కానీ ఇదంతా జీవితంలో ఒక భాగమే మన పని మనం కరెక్ట్ గా చేయాలి అంటూ శృతి హాసన్ తెలిపారు.

They Are All Part Of Life Valentines Day Special Is The Same Shruthi Haasan Deta

ఇక మరో నెటిజన్ మాత్రం శృతిహాసన్ లైఫ్ గురించి అడుగుతూ మీరు మీ వాలెంటైన్స్ డేని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారని అడిగాడు.దాంతో శృతిహాసన్ తను ప్రేమించే వ్యక్తి శంతను హాజరికతో ఒకే ఇంటిలో కలిసి ఉంటున్న విషయం అందరికీ తెలిసిందే.వీరిద్దరూ కలిసి ఈ వాలెంటైన్స్ డే ను సెలబ్రేట్ చేసుకున్నామని శంతను హజారిక తనకు పూలతో డెకరేట్ చేసి రొమాంటిక్ గా విష్ చేశాడని దాని తరువాత ఇద్దరు కలిసి పాస్తా వండుకుని తిన్నామని, వారికి నచ్చిన సినిమాలను చూస్తూ ఎంజాయ్ చేశామని శృతి హాసన్ తన అభిమానులకు తెలియచేశారు.

Advertisement

తాజా వార్తలు