మీ దంతాలు చాలా బలహీనంగా మారాయా.. వర్రీ వద్దు వెంటనే ఇలా చేయండి!

మ‌నం ఆరోగ్యంగా ఫిట్ గా ఉండాలి అంటే మన దంతాలు ( Teeth )కూడా స్ట్రాంగ్ గా ఉండాలి.అప్పుడే ఏ ఆహారమైన తినగలుగుతాము.

కానీ చాలా మంది దంతాల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.ఫలితంగా పాతిక, ముప్పై ఏళ్లకే దంతాలు బలహీనంగా మారిపోతూ ఉంటాయి.

దంతాల పోటు, జివ్వుమని లాగేయడం, పళ్ళు పుచ్చిపోవడము.ఇలా ఎన్నో సమస్యలు కూడా తలెత్తుతుంటాయి.

వాస్తవానికి దంతాలు హెల్తీగా ఉండాలంటే రోజుకు రెండు సార్లు బ్రష్ చేస్తే సరిపోదు.వాటిని దృఢంగా మార్చే ఆహారాలను కూడా డైట్ లో చేర్చుకోవాలి.

These Foods Help To Strengthen Your Teeth , Weak Teeth, Strong Teeth, Latest N
Advertisement
These Foods Help To Strengthen Your Teeth , Weak Teeth, Strong Teeth, Latest N

ఈ జాబితాలో ముందుగా చెప్పుకోవాల్సింది పాలు,( Milk ) పెరుగు, పన్నీర్.వీటిలో మెండుగా ఉండే క్యాల్షియం మరియు ప్రోబయోటిక్స్ వీక్ గా ఉన్న దంతాలను చాలా స్ట్రాంగ్ గా మారుస్తాయి.కావిటీస్ నుంచి రక్షిస్తాయి.

అలాగే బలహీనమైన దంతాలతో బాధపడుతున్న వారు నిత్యం ఒక క్యారెట్ ను తినండి.లేదా ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్ తాగండి.

క్యారెట్ లో ఉండే పోషకాలు దంతాలను బలపరచడానికి గ్రేట్ గా సహాయపడతాయి.

These Foods Help To Strengthen Your Teeth , Weak Teeth, Strong Teeth, Latest N

ఆకుకూరలు దంతాల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.నిత్యం ఏదో ఒక ఆకుకూర తీసుకుంటే వాటిలో ఉండే క్యాల్షియం మరియు ఫోలిక్ యాసిడ్ దంతాలను స్ట్రాంగ్ గా మారుస్తాయి.చిగుళ్ల ఆరోగ్యాన్ని సైతం మెరుగుపరుస్తాయి.

ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!

యాపిల్, పియర్స్,( Apple pears ) స్ట్రాబెర్రీస్, ఫిష్, బాదం, పిస్తా, వాల్ నట్స్, గుమ్మడి గింజలు వాటి ఆహారాలను కూడా డైట్ లో ఉండేలా చూసుకోండి.ఇవి దంతాల ఆరోగ్యానికి సూపర్ గా తోడ్పడతాయి.

Advertisement

అంతేకాదు వాటర్ ను ఎక్కువ తీసుకోండి.మ‌నం ఆహారాన్ని తీసుకునేట‌ప్పుడు దంతాల‌పై మ‌రియు దంతాల సందుల్లో ఆహార ప‌దార్థాలు, చ‌క్కెర‌లు పేరుకుపోతాయి.

ఇవి నోట్లో ఉండే బ్యాక్టీరియాతో క‌లిసి దంతాల ఆరోగ్యాన్ని దెబ్బ‌తిస్తాయి.అందుకే నీటిని ఎక్కువ‌గా తాగ‌డం వ‌ల్ల దంతాల‌పై చ‌క్కెర‌లు, ఆహార ప‌దార్థాలు పేరుకుపోకుండా ఉంటాయి.

దంతాల ఆరోగ్యం పాడ‌వ‌కుండా ఉంటుంది.

తాజా వార్తలు