పాలలో కంటే ఈ ఆహార పదార్థాలలో కాల్షియం ఎక్కువ...

ప్రతిరోజు మన శరీరానికి చాలా కాల్షియం అవసరం అవుతుంది.అయితే ప్రతి రోజు కాల్షియం ఉండే ఆహార పదార్థాలను మనం తీసుకుంటే సరిపోతుంది.

మన లో ప్రతి ఒక్కరూ పాలు తీసుకుంటే మన శరీరనికి ఎక్కువ క్యాల్షియం అందుతుందని అనుకుంటారు.పాలలో కంటే కాల్షియం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు కూడా ఉన్నాయి.

మరి కొంత మందికి పాలు అంటే ఇష్టం ఉండదు.అలాంటివారు ఈ ఆహార పదార్థాలను తీసుకుంటే వారి శరీరానికి కావలసినంత కాల్షియం అందుతుంది.

మన శరీరం లోని ఎముకలు బలంగా ఉండాలంటే కాల్షియం చాలా అవసరం.కాల్షియం మన శరీరానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

Advertisement
These Foods Have More Calcium Than Milk Details, Calcium, Calcium Foods, Milk ,

కాల్షియం విటమిన్ డి తో కలిసి అధిక రక్తపోటు, క్యాన్సర్, మధుమోహం వంటి వ్యాధుల భారిన పడకుండా కాపాడుతుంది.తోటకూరలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది.

వారంలో రెండు మూడు సార్లు తోటకూర తీసుకుంటే మన ఎముకలు బలంగా ఉంటాయి.నల్ల నువ్వుల లో కూడా కాల్షియం ఎక్కువగా ఉంటుంది.

నువ్వులు బెల్లం కలిపి తింటే మన శరీరానికి కావలసినంత కాలుష్యం లభిస్తుంది.

These Foods Have More Calcium Than Milk Details, Calcium, Calcium Foods, Milk ,

ఇంకా చెప్పాలంటే అంజీర పండ్ల లో క్యాల్షియంతో పాటు ఫైబర్, ఐరన్ కూడా సమృద్ధిగా ఉంటాయి.రాత్రి రెండు అంజిర పండ్లను నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం వాటిని తిని, నీటిని కూడా తాగాలి.ఇలా ప్రతిరోజు రెండు అంజీర పండ్లను తినడం వల్ల మన శరీరంలోని క్యాల్షియం లోపం తగ్గడమే కాకుండా రక్తహీనత సమస్య కూడా ఎప్పటికీ రాదు.

ఇదేం కాంప్లిమెంట్ రా బాబోయ్.. పొగిడినట్టే పొగిడి భారతీయులను అవమానించిన ఆస్ట్రేలియా కపుల్..
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 26, శుక్రవారం 2023

ఓట్స్ ను వారానికి రెండు రోజులు తింటే మన శరీరానికి కాల్షియం మరియు ఫైబర్ అధికంగా లభిస్తాయి.ఓట్స్ ను తరచుగా తీసుకుంటే కాల్షియం లోపం తగ్గడమే కాకుండా అధిక బరువు కూడా తగ్గవచ్చు.

Advertisement

తాజా వార్తలు