కంటెంట్ ఉన్నా శర్వానంద్ సినిమా వీక్ అవ్వడానికి షాకింగ్ రీజన్స్?

యంగ్ హీరో శర్వానంద్, రీతూ వర్మ జంటగా నటించిన తాజా చిత్రం ఒకే ఒక జీవితం.ఇందులో అమలా కూడా నటించిన విషయం తెలిసిందే.

శ్రీ కార్తీక్ దర్శకుడిగా వ్యవహరించారు.ఈ సినిమా సెప్టెంబర్ 9న విడుదలైన విషయం తెలిసిందే.

అలాగే వెన్నెల కిషోర్, ప్రియదర్శి కూడా కీలకపాత్రలో నటించారు.ఈ సినిమా ఇటీవలే విడుదలైన మంచి హిట్ టాక్ ని తెచ్చుకుంది.

కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను సాధించలేకపోయింది.ఈ సినిమా ఆశించిన విధంగా కలెక్షన్లను కూడా రాబట్టలేకపోయింది.

Advertisement

ఈ సినిమా అనుకున్న విధంగా సక్సెస్ ని సాధించలేకపోవడానికి ఐదు కారణాలు ఉన్నాయి అని అంటున్నారు.అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మొదటగా ఈ సినిమా చిత్ర బృందం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ను పెద్ద ఎత్తున చేయకపోవడం మొదటి కారణంగా చెప్పుకుంటున్నారు.రెండో కారణం విషయానికొస్తే సినిమాలోని చాలా సన్నివేశాలు సాగదీసినట్టుగా ఉన్నాయి.

సినిమాలో శర్వానంద్ పాట పాడే సన్నివేశాలు చాలావరకు సాగదీసారు.ఇక మూడవ కారణం విషయానికి వస్తే ప్రస్తుతం రోజుల్లో ప్రేక్షకులు చాలా వరకు సినిమా థియేటర్లకు రావడం మానేశారు.కంటెంట్ ఉన్న సినిమాలను మాత్రమే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.

శర్వానంద్ సినిమా అనగానే చాలామంది ప్రేక్షకులు ఓటీటీ చూడవచ్చు లే అన్న అభిప్రాయంతో ఉన్నారు.

ఆ పోస్ట్ లు షేర్ చేసేది ప్రభాస్ కాదు.. పృథ్వీరాజ్ సుకుమారన్ కామెంట్స్ వైరల్!
ఏడాదికి పైగా పాకిస్తాన్ లో మగ్గిపోయాం.. రియల్ తండేల్ కామెంట్స్ వైరల్!

ఇంక నాలుగు కారణం ఈ సినిమా రాంగ్ తేదీన విడుదల అవ్వటం.విడుదలైన రోజు గణేష్ నిమజ్జనం అని తెలీసి కూడా ఆరోజు ఆ సినిమాను విడుదల చేశారు.దీంతో ఆరోజు సినిమాకు చాలా వరకు ఓపెనింగ్స్ రాలేదు.

Advertisement

ప్రేక్షకులు కూడా పెద్దగా సినిమా థియేటర్లకు వెళ్లలేదు.రెండు మూడు రోజులు కూడా గణేష్ నిమజ్జన ఉత్సవాల్లో నిమగ్నమైన ప్రేక్షకులు చాలా వరకు ఈ సినిమా రిలీజ్ అయిన విషయాన్ని కూడా మర్చిపోయారు.

ఇది చివరగా సినిమా విడుదల అయిన తరువాత కేవలం హైదరాబాదులో ఒక్క సక్సెస్ మీట్ ను మాత్రమే ఏర్పాటు చేశారు.హీరో శర్వానంద్ ఈ సినిమాపై అంత నమ్మకాలు పెట్టుకున్నప్పుడు సినిమా సక్సెస్ మీ ఇంట్లో కోసం కూడా కొన్ని రోజులు కేటాయించాల్సింది.

అంతేకాకుండా కేవలం హైదరాబాదులోనే కాకుండా ఇతర ప్రదేశాలు కూడా తిరిగి అక్కడ కూడా సక్సెస్ మీట్లు ఏర్పాటు చేసి ఉంటే కలెక్షన్లు బాగా వచ్చేవి అంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తాజా వార్తలు