పూజ చేసే సమయంలో గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలివే!

మన హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఇంటిలో పూజ చేస్తూ మన ఇష్టదైవాన్ని ఆరాధిస్తూ ఉంటాము.

ఈ విధంగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇంట్లో దీపారాధన చేయడం ఒక ఆనవాయితీగా వస్తుంది.

అయితే ఈ విధంగా పూజ చేసే సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఎన్నో విషయాలను జాగ్రత్తగా గుర్తుంచుకోవాలని పండితులు చెబుతున్నారు.పూజ అంటే కేవలం దీపం పెట్టి అగరబత్తీలు వెలిగించడమే కాదు పూజ చేసేటప్పుడు సరైన పద్ధతిలో చేయడం ఎంతో ముఖ్యం.

మరి పూజ చేసేటప్పుడు ఎలాంటి పద్ధతులను అనుసరించాలి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.పూజ చేసేటప్పుడు మీ మొహం ఎల్లప్పుడు తూర్పు దిశ వైపు ఉండాలి.

అయితే పూజ చేసేటప్పుడు చాలామంది నేలపై కూర్చుని పూజలు చేస్తారు.అయితే ఇది సరైన పద్ధతి కాదని పండితులు చెబుతున్నారు.

Advertisement
These Are The Important Things To Keep In Mind While Doing Puja, Puja, Main Thin

పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా ఆసనం వేసుకుని పూజ చేయాల్సి ఉంటుంది.ఈ విధంగా ఆసనం లేకుండా పూజ చేయటం వల్ల పరమ దరిద్రమని పండితులు చెబుతున్నారు.

These Are The Important Things To Keep In Mind While Doing Puja, Puja, Main Thin

ఇక ఇంట్లో ప్రతి రోజు ఉదయం సాయంత్రం తప్పనిసరిగా దీపారాధన చేయాలి.ఇలా దీపారాధన చేయటం వల్ల సకల దేవతల అనుగ్రహం మనపై ఉంటుంది.ముఖ్యంగా మన ఇంట్లో పంచ లోహ విగ్రహాలు ఉన్నప్పుడు పంచ దేవుళ్ళు ఉన్నప్పుడు మరిన్ని జాగ్రత్తలు పాటించాలి.

పంచ దేవుళ్ళు అనగా విష్ణువు, గణేశుడు, మహాదేవుడు, సూర్య దేవుడు, దుర్గాదేవిలను పంచదేవుళ్ళు అంటారు. వీరిని పూజించే విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మంచిది.

ఉత్తరాంధ్ర భద్రాద్రి రామతీర్థం గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
Advertisement

తాజా వార్తలు