వీడియో: పవిత్ర ప్రదేశంలో ఆ పని చేసిన యువతి.. మండిపడుతున్న జపానీయులు..

ప్రతి దేశానికి, ప్రతి ప్రాంతానికి తమదైన సంస్కృతులు, ఆచారాలు( Cultures ,customs ) ఉంటాయి.

కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఈ సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలుసుకొని వాటిని గౌరవించడం చాలా ముఖ్యం.

కానీ సోషల్ మీడియా పిచ్చిలో పడి చాలామంది వీటిని విమర్శించి చేయకూడని పనులు చేస్తున్నారు.తాజాగా చిలీ దేశానికి చెందిన ప్రముఖ జిమ్నాస్ట్( Gymnast ), సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మారియా డెల్ మార్ ‘మరిమార్’ పెరెజ్ బానిస్‌( Marimar Perez Banis ) కూడా అలాంటి తప్పు చేసింది.

దాంతో ఆమెపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.వివరాల్లోకి వెళ్తే, మరిమార్ జపాన్‌లోని ఒక షింటో మందిరంలోని పవిత్రమైన ‘టోరీ’ గేట్‌పై పుల్-అప్స్ చేసింది.

ఆ వర్కౌట్ చేస్తున్న వీడియోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేసింది.ఈ వీడియోలో మారిమార్ ఈ పవిత్రమైన గేట్‌ను ఉపయోగించి వ్యాయామం చేయడం చాలా మందికి నచ్చలేదు.

Advertisement
The Young Woman Who Did That In The Holy Place Of The Video Is Angry With The Ja

జపాన్‌లో ఈ టోరీ గేట్లు చాలా పవిత్రమైనవిగా భావిస్తారు.వాటిని వ్యాయామం చేయడానికి ఉపయోగించడం అక్కడి సంస్కృతికి వ్యతిరేకమని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

The Young Woman Who Did That In The Holy Place Of The Video Is Angry With The Ja

టోరీ గేట్లు సాధారణంగా షింటో ఆలయాల ( Shinto temples )ప్రవేశద్వారాల వద్ద ఉంటాయి.ఈ గేట్లు భౌతిక ప్రపంచం, ఆధ్యాత్మిక ప్రపంచం మధ్య సరిహద్దును సూచిస్తాయి.మరిమార్ తన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆమె చేసిన తప్పు వెలుగులోకి వచ్చింది.

చాలా మంది ఆమెను తీవ్రంగా విమర్శిస్తున్నారు.కొంతమంది ఆమెపై చర్య తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.

వైరల్ వీడియో ఓపెన్ చేస్తే మనకు మరిమార్ టోరీ గేట్‌ను ఒక రకమైన కడ్డీలా వాడుకుని పుల్-అప్స్ చేయడం కనిపించింది.అంతేకాదు, DJ కాస్పర్ పాటైన ‘చా చా స్లైడ్’కి( cha cha slide ) తగ్గట్టుగా తన కాళ్లను కదిలిస్తూ చాలా ఫన్నీగా వీడియో తీసింది.

ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!

ఈ వీడియో చాలా మందికి నచ్చక, ఆమెపై విమర్శలు వచ్చాయి.దాంతో ఆమె ఆ వీడియోను తొలగించేసింది.

Advertisement

కానీ అప్పటికే ఆ వీడియోను 4 కోట్లకు పైగా మంది చూసేశారు!.

ఈ విషయంపై తీవ్ర విమర్శలు వచ్చిన తర్వాత, మరిమార్ తన వీడియోను తొలగించి, క్షమాపణ చెబుతూ మరొక వీడియోను పోస్ట్ చేసింది."నేను ఇలా చేసినందుకు నాకు చాలా బాధగా ఉంది.నా ఉద్దేశం అవమానించడం కాదు.

క్షమించండి" అని ఆమె స్పానిష్‌లో చెప్పింది.ఆమె ప్రజలను తనకు సందేశాలు పంపడం ఆపమని కూడా కోరింది.మరిమార్ ఒక మాజీ జిమ్నాస్ట్.2019లో సౌత్ అమెరికన్ చాంపియన్‌షిప్‌లలో ఆమె రజత పతకం గెలుచుకుంది.ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను 1,40,000 మంది ఫాలో అవుతున్నారు.

కొంతమంది మరిమార్ క్షమాపణ చెప్పినందుకు ఆమెను ప్రశంసించారు.కానీ మరికొందరు ఆమె జపాన్ మతం, సంస్కృతిని అవమానించిందని ఆరోపించారు.

"మర్యాద లేని చాలా మంది విదేశీయులు జపాన్‌కు వస్తారు.జపాన్ వాసులు దీనితో విసిగిపోతున్నారు" అని ఒకరు వ్యాఖ్యానించారు.మరొకరు "జపాన్‌కు తిరిగి రాకు" అన్నారు.https://www.instagram.com/p/DBI-bNXS8mr/?hl=en .

తాజా వార్తలు