Vijay Devarakonda ,Sonal Montero : విజయ్ దేవరకొండ పై మనసు పారేసుకున్న యంగ్ బ్యూటీ?

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా స్థాయిలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో నటుడు విజయ్ దేవరకొండ ఒకరు.

ఈయన ఎంతోమంది హీరోయిన్లకు అభిమాన హీరోగా మారిపోయారు ఇప్పటికే ఎంతోమంది ఈయనతో సినిమా చేయాలని కలలు కంటున్నారు.

ఇకపోతే ఇదే లిస్టులోకి చేరిపోయారు మరొక నటి సోనాల్‌ మోంటెరో.జయతీర్థ దర్శకత్వంలో తిలకరాజ్‌ బల్లాల్‌ నిర్మించిన చిత్రం బనారస్‌.ఈ సినిమాని తెలుగులో సతీష్ వర్మ విడుదల చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నటి మోనాల్ మాట్లాడుతూ మంచి కంటెంట్ ఉన్న సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారు అదేవిధంగా ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలను ఎలా ఆదరిస్తారో మంచి నటన కనబరిచే నటీ నటులను కూడా ఆదరిస్తారని అందుకే తనకు తెలుగు ప్రేక్షకులు అంటే ఎంతో అభిమానం అని తెలిపారు.

ఈ సినిమా గురించి మోనాల్ మాట్లాడుతూ ఈ సినిమాలో తాను దని అనే పాత్రలో నటించానని సినిమాలో హీరోకి ఎంత ప్రాధాన్యత ఉంటుందో తన పాత్రకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుందని ఈమె వెల్లడించారు.ఇక తెలుగు సినిమాల గురించి మాట్లాడుతూ తాను ఆర్‌ఆర్‌ఆర్‌, పుష్ప, సీతారామం సినిమాలు చూశాననీ, తెలుగు హీరోలలో విజయ్‌ దేవరకొండ అంటే చాలా ఇష్టంమని తెలిపారు.ప్రస్తుతం తానుమూడు సినిమాలలో నటిస్తున్న అన్ని అందులో ఒకటి సరోజినీ నాయుడు బయోపిక్ లో తాను నటిస్తున్నానని ఈ సందర్భంగా ఈమె వెల్లడించారు.

Advertisement
రాష్ట్రపతి ముర్ము విందుకు వచ్చిన ఇండోనేషియన్లు ఏం చేశారో చూడండి.. వీడియో వైరల్..

తాజా వార్తలు