హైదరాబాద్ బంజారాహిల్స్ లోని డీఏవీ స్కూల్ అనుమతిని తెలంగాణ విద్యాశాఖ పునరుద్ధరించింది.ఈ విద్యా సంవత్సరానికి విద్యాశాఖ తాత్కాలిక అనుమతి ఇచ్చింది.
అదేవిధంగా నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.బంజారాహిల్స్ లోని డీఏవీ స్కూల్ లో ఎల్కేజీ చదువుతున్న నాలుగేళ్ల చిన్నారిపై ప్రిన్సిపాల్ కారు డ్రైవర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.
ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం స్కూల్ గుర్తింపును రద్దు చేసిన విషయం తెలిసిందే.