కరోనా వ్యాక్సిన్ తీసుకోవ‌డం ఇష్టం లేకుంటే దేశం విడిచి వెళ్లిపోమ్మంటున్న అధ్య‌క్షుడు.. !!

ప్రపంచంలోకి కరోనా వస్తూ వస్తూ ప్రజల కంటికి మరచిపోని కన్నీరుని తెచ్చింది.ఎప్పటికి దూరం అవని బాధలను మోసుకొచ్చింది.

ఈ వైరస్ ప్రజలతో ఎన్ని రకాలుగా ఆడుకోవాలో అన్ని దారులో చెడుగుడు ఆడేసుకుంటుంది.అయితే ఇలాంటి విషమ పరిస్దితుల్లో ఈ కోవిడ్ కోసం వ్యాక్సిన్ తయారు చేశారు శాస్త్రవేత్తలు.

The President Is Leaving The Country If He Does Not Want To Take The Corona Vacc

కానీ ఈ టీకాను కొందరు తీసుకుంటుండగా, మరి కొందరు మాత్రం వ్యాక్సిన్ అంటేనే దూరం దూరంగా ఉంటున్నారు.ఇలాంటి వారి విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్న అధికారులు టీకా తీసుకున్న వాళ్లకు కొన్ని ఆఫర్లు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే.

మరి కొన్ని దేశాలైతే కఠినంగా వ్యవహరిస్తున్నాయి.అలాంటి దేశాల్లో ఫిలిపిన్స్ కూడా ఒక‌టి.

Advertisement

ఈ దేశంలో నివసిస్తున్న ప్రతి పౌరుడు తప్పకుండా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని లేదంటే అరెస్ట్ లు త‌ప్ప‌వ‌ని.లేదా దేశం విడిచి వెళ్లిపోవాల‌ని అధ్య‌క్షుడు రోడ్రిగో హెచ్చ‌రిస్తున్నారట.

కాగా ఈయన చేసిన వ్యాఖ్య‌లు ప్రస్తుతం సంచ‌ల‌నంగా మారాయి.

Advertisement

తాజా వార్తలు