ఏపీ సీఎం జగన్‎పై దాడి కేసులో విచారణ వేగవంతం

ఏపీ సీఎం జగన్‎పై( AP CM Jagan ) దాడి కేసులో పోలీసుల విచారణ వేగవంతమైంది.

ఇప్పటికే ఆరు బృందాలను ఏర్పాటు చేసిన బెజవాడ పోలీసులు( Bejwada Police ) వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన పోలీసులు వివరాలను సేకరించారు.తాజాగా మరో 16 టీమ్ లను పోలీసులు ఏర్పాటు చేశారు.

ఒక్కొక్క టీమ్ లో డీసీపీ, అదనపు డీసీపీతో పాటు డీఎస్పీ ర్యాంక్ అధికారుల నియామకం జరిగింది.సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా అధికారుల దర్యాప్తు సాగుతోంది.

కాగా ముఖ్యమంత్రి జగన్ పై దాడి ఘటనపై ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ( MLA Vellampalli Srinivas )పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement
ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

తాజా వార్తలు